గుంటూరు జిల్లా జనసేన అడ్డా

 

గుంటూరు జిల్లా జనసేన అడ్డా గా మారనుందా? అవును అనే చెప్పాలి వివరాల్లోకి వెళ్లితే.

JspNews-గుంటూరుజిల్లా: ది 27/05/18న గుంటూరులో దళిత,బిసి నాయకులు సుమారు 500 మంది జనసేన లో చేరిక.గుంటూరు జిల్లా దళిత సంఘము నాయకుడు ఏకుల శ్యామ్ సుందర్ మరియు బిసి నాయకులు తేలుకుట్ల శ్రీనివాసరావు వారి పరివారం అనుచరులు తో సుమారు 500 మంది తో గుంటూరు జనసేన ఆజాద్ యువసేన విభాగ నేత తన్నీరు కిషోర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరినట్లు సమాచారం.తన్నీరు కిషోర్ కి శ్యామ్ సుందర్ కి ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు కలిగివున్నది తన్నీరు కిషోర్ కాపు సామాజిక వర్గానికి చెందినప్పటికి దళితులు, బిసి,మైనార్టీ లకు చెందిన వారితో స్నేహ సంబంధాలు ఎక్కువ అందరిని కలుపుకొని పోయే తత్వం దీనితో పాటుగా గుంటూరు ,పత్తిపాడు, మంగళగిరి, తెనాలి,రేపల్లె, వేమూరు, సత్తెనపల్లి, నరసరావుపేట తదితర ప్రాంతాల్లో వీరికి ఎక్కువగా స్నేహితులతో పాటుగా ,బంధువర్గం కలిగి ఉన్నారు వారినందరిని జనసేన వైపు తీసుకువస్తున్నారు. ఆది నుండి తన్నీరు కిషోర్ పార్టీలో చురుగ్గా పనిచేస్తు అనేక సేవ కార్యక్రమాలు చేసి పవన్ కళ్యాణ్ అప్పచెప్పిన సేవదళ్ లో త్రికరణ శుద్ధిగా పనిచేయటం జరిగింది. కిషోర్ కి జిల్లా యువసేన పగ్గాలు ఇవ్వాలని ప్రెసిడెంట్ టీమ్ కి జనసైనికులు చెప్పినట్లు సమాచారం అప్పుడే గుంటూరు జిల్లా వ్యాప్తంగా జనసేన జండా ఖాయం అంటున్నారు.ఏదీ ఎమైనా దళితులు, బిసిలు జనసేన లో చేరటం శుభపరిణామం అనిపిస్తుంది.
@Analysis By Jsp News Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!