నెల్లూరు ప్రభుత్వ బి సి బాయ్స్ హాస్టల్ బాధిత విద్యార్థులకు అండగా జనసేన మహిళా సైనికులు మరియు కార్యకర్తలు

 

కనీస వసతులు లేని నెల్లూరు ప్రభుత్వ బి సి బాయ్స్ హాస్టల్ దుస్థితి, అక్కడి విద్యార్థుల అగచాట్లు వర్ణనాతీతం, కనీస సౌకర్యాల మాట అటు ఉంచితే వర్షం నీరు కూడా బయటికి పోలేని స్థితిలో విద్యార్థుల పుస్తకాలు కూడా తడిసి ముద్దవుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెట్టిన్నట్లు మౌనం గా ఉండటం దురదృష్టకరం, ఈ సమస్యలను విద్యార్థుల అగచాట్లను గుర్తించిన జనసేన మహిళా సైనికులు మరియు కార్యకర్తలూ వెను వెంటనే స్పందించి హాస్టల్ కు చేరుకొని అక్కడి పరిస్థితులనీ, విద్యార్థుల అవస్థలని చూస్తూ చలించి పోయారు, అక్కడికక్కడే అధికారులను హాస్టల్ లోని ఆహారం మీరు తినగలరా అంటూ నిలదీస్తూ హాస్టల్ పరిస్థితుల పట్ల వివరణ కోరుతూ విద్యార్థులకు బాసటగా నిలిచారు.

 

విద్యార్థులను కులమతాలకు అతీతంగా చూడాల్సిన ప్రభుత్వాలే ఇలా సాంఘిక సంక్షేమం పేరుతో నిర్వహిస్తున్నటువంటి వసతి గృహాల్లో కనీసం తినే తిండి కుక్కలు కూడా ముట్టనంత అద్వానంగా ఉందంటే అసలు ప్రభుత్వం సక్రమంగా నిధులు విడుదల చేస్తుందా ఒకవేళ చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు వాటికీ ఏ మేరకు వినియోగిస్తున్నారు అనేది స్పష్టం కావాల్సి ఉందనీ, ప్రజా ప్రతినిధులని చెప్పుకునే నాయకులకు విద్యార్థుల సమస్యలు కనపడవా అంటూ ప్రశ్నించారు, హాస్టల్ అధికారులు మరియు సిబందితో మాట్లాడిన జనసైన్యం తక్షణమే హాస్టల్ పురోగతి మరియు ఫుడ్ క్వాలిటీ పట్ల హామీ ఇవ్వాలని ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు,అనంతరం రోడ్ పై బైఠాయించి నిరసన తెలియచేసిన జనసేన కార్యకర్తలు .

ఈ కార్యక్రమంలో సింహపురి జనసేన మహిళా కార్యకర్తలైనటువంటి కృష్ణవేణి గారు, విజయలక్ష్మి గారు , నాగరత్నం గారు మరియు రోజా రాణి గారు అలాగే విద్యార్థి సంఘ నాయకులు ఆషిఫ్ గారు , మధు గారు మరియు వెంకట్ గారు తదితరులు పాల్గొని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని వారికి జనసేన అండగా ఉంటుందనే భరోసా కల్పించారు.
జనం కోసం నిస్వార్థంగా పనిచేసే జనసేన పార్టీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని అని చాటి చెప్పిన జనసేన మహిళా సైనికులకు మరియు కార్యకర్తలకు విద్యార్థులు తమ ఆనందాన్ని , క్రుతజ్ఞతలనీ తెలియచేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!