మే డే సందర్భంగా కార్మికులతో గుడివాడ జనసేన కార్యకర్తలు.. Happy May Day – Jana Sena Party followers Gudivada

Happy May Day – Jana Sena Party followers Gudivada

మే దినోత్సవం లేదా మే డే (May Day) ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. పబ్లిక్ శెలవుదినం. చాలా దేశాలలో మే దినం, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా కార్మిక దినోత్సవంతో ఏకీభవిస్తాయి. ఇవి అన్నీ కూడా కార్మికుల పోరాటం మరియు కార్మికుల ఐక్యతను గుర్తిస్తాయి.

ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ చాకిరీ మేం చేయలేమని పని ముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి (రెస్టు), ఇంకా ఎనిమిది గంటలు రిక్రీయేషన్‌ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిన మార్పు.

 

మే డే దినోత్సవం సందర్భంగా జనసేన కార్యకర్త బూరగడ్డ శ్రీకాంత్ గారి ఆద్వర్యంలో కార్మికులకు రెడ్ టవల్స్ మరియు మజ్జిగ పంపిణీ చేసిన గుడివాడ జనసేన కార్యకర్తలు ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు సంధూ పవన్, వినీత్, భద్ర, రంగనాథ్, బూరగడ్డ యూత్ పాల్గొన్నారు..

జనసేన గుడివాడ..

Happy May Day – Jana Sena Party followers Gudivada

Follow Us :  https://www.facebook.com/JanaSenaNews.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!