పవన్ కళ్యాణ్ ఆదేశాలు..! పార్లమెంట్ స్థాయిలో జనసేన పార్టీ కీలక సమావేశాలు..!

హైదరాబాద్ : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో వివిధ జిల్లాల్లో జనసేన పార్టీ అధికారికంగా సమావేశాలు నిర్వహించేందుకు రంగం సిద్ధం అవుతుంది. ఇందుకు అనుగుణంగా జనసేన పార్టీ నుండి అధికారికంగా సమాచారం కార్యకర్తలకు చేరింది. మొదటిగా శ్రీకాకుళం , విశాఖపట్నం , తూర్పుగోదావరి జిల్లాల్లో పార్లమెంట్ స్థానాల వారిగా జనసేన పార్టీ అధికార ప్రతినిధుల సమక్షంలో ఈ కీలక సమావేశాలు జరగనున్నాయి అని సమాచారం

జనసేన పార్టీ అధికారిక ప్రకటన

జనసేన ఔత్సాహికుల వేదికలో పాల్గొన్న మీకు కృతజ్ఞతలు. స్వచ్ఛమైన రాజకీయ వ్యవస్థ , బలమైన పౌర సమాజం నిర్మాణం కోసం జనసేన తలపెట్టిన ఈ మహా యజ్ఞంలో భాగస్వాములు అవుతున్నందుకు శుభాభినందనలు.ఔత్సాహక వేదికలో పాల్గొన్నవారిలో కొందరిని  సమన్వయకర్తలుగా ఎంపిక చేసి   ముఖ్యమైన భాద్యతలను అప్పగించడానికి పార్టీ నిర్ణయించింది.వీరు నియోజకవర్గం స్థాయిలో పనిచేయవలసి వుంది.

సమన్వయకర్తలు నిర్వహించవలసిన పార్టీ కార్యక్రమాలు క్లుప్తంగా . ..
1 ) పార్టీ కార్యక్రమాల కోసం మీరు తగినంత స్థాయిలో సమయాన్ని కేటాయించగలగాలి.
2 ) నియోజకవర్గ స్థాయిలో పార్టీ తరపున పార్టీ ఆదేశాలకు అనుగుణంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించాలి.
3 ) అవసరమయితే ఆది , శనివారలతో పాటు సాయంత్రం వేళలో కూడా మీరు మీ సమయాన్ని పార్టీ కార్యక్రమాల కోసం కేటాయించవలసి ఉంటుంది.
4 ) సమాజ సేవ కోసం పార్టీ రూపకల్పన చేసే కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి.
5 ) మీరు జనసేన సమన్వయకర్తగా ఎంపికైన తరువాత హైదరాబాద్ లో జరిగే శిక్షణ శిభిరంలో పాల్గొనవలసి ఉంటుంది.

సమన్వయకర్తలుగా పనిచేయాలనుకుంటే ఈ దిగువున వున్నా లింక్ ని క్లిక్ చేసి మీ అభిమతం  లోపు తెలుపండి .
Click Here 

మీరు జనసేన సమన్వయకర్తగా ఎంపికైన తరువాత మీకు పార్టీ సిద్ధతల గురించి నిరంతర శిక్షణ లభించును.  

6 thoughts on “పవన్ కళ్యాణ్ ఆదేశాలు..! పార్లమెంట్ స్థాయిలో జనసేన పార్టీ కీలక సమావేశాలు..!

 • 11/01/2017 at 2:04 PM
  Permalink

  డబ్బుల కోసం కాదు ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం నా మొదటి సారిగా రాజకీయ పార్టీ జెనసేన ను చూస్తున్నాను అందులో నిను వుంది

  Reply
 • 11/02/2017 at 7:01 AM
  Permalink

  I am support janasena

  Reply
 • 11/04/2017 at 11:23 AM
  Permalink

  I am supporting janasena jai janasena

  Reply
 • 11/05/2017 at 11:15 AM
  Permalink

  prathi adugu jagrattatho mundu chupu tho adugu veyandi,thappka vijayam sadistaru.

  Reply
 • 11/06/2017 at 12:50 PM
  Permalink

  I’m interested to work with janasena party

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!