జనసేన సైనికురాలు పిలుపు

పార్టీ పెట్టి జై కొడితే సరిపోదు ..!
రంగుల గుడ్డకు ,కర్ర కడితే సరిపోదు ..!
ఊరి నిండా అభిమానులుంటే సరిపోదు ..!
గుండె పైన పేరు పచ్చపొడిస్తే సరిపోదు ..!
బైకు చక్రాలకు వేగం పెంచితే సరిపోదు ..!
ఊరినిండా ప్లెక్సీల తోరణాలు వేస్తే సరిపోదు …!
కేకు ముక్కాలా హడావిడి తీపిసందడి సరిపోదు …!
మన వాడు వచ్చాడు రండి ,
రండి అక్క ,అమ్మ ,చెల్లి ,అవ్వ ,
అన్న,తమ్ముడు , బాబాయ్,మామయ్య, అని కువ్వలు పోగేస్తే సరిపోదు …!
జై జై నాయకుడి నాయత్వం వర్ధిల్లాలి అంటే సరిపోదు …!
హారతుల,నీరాజనాలతో ,కులపోల్లు బొట్లు పెట్టి కలసి మేము వున్నాం అని అంటే సరిపోదు …!

ఇంకా ,అభిమానం గుమ్మరిిచ్చి,సీఎం ,సీఎం అని అరిచినా ఈ వ్యక్తి మనసుని గెలవలేరు ….!

ఎందుకంటే ఇది పార్టీ కాదు ,………!
కన్నీటి చుక్కల అర్ధనాధలలో పుట్టి,ఒక ఆవేదన గర్జనతో రగిలి…!
ఒక తెలుగు వాడి జీవాన్ని పతనంతో కాల రాసిన యుగాంతర చరిత ఉద్యమ చారిత్రికం …!

చాలవు మీ కేకల అరుపులు,చాలించవు మీ మాటలు ..!
అవినీతి కోరలు పీకే సాహసం వెంట ,
కసితో ఉరకలు పెట్టె ,విప్లవ యువత కావాలి ,
ఒక తెగింపు తెగిపడితే ,
దేశాలు దద్దరిల్లే యువ రక్తం కావాలి ..!
ప్రజా సమస్యను భుజం పై మోసే సత్తావుండాలి ..!
తరలి తీసుకెళ్లి అధికార పీఠానికి మెడలు వంచి ,
సాధన మన తెలుగు మట్టికి తీసుకు రావాలి ..!
పుట్టిన మట్టిలో నేలపై స్థిరంగా నిలబడాలి ..!
మట్టి వాసనా రైతు కుటుంభం మనదై బ్రతకాలి .!
జవాను కుటుంబానికి రుణపడి జీవించాలి …!
తుమ్మితే పోయే పదవికన్నా ,ప్రజల కష్టానికి రుణపడి ఉండాలి ..!
ఓటమి అనంతరం కూడా సేవకుడివై స్ఫూర్తి నివ్వాలి ..!
పట్టిన జెండా చేతిలో కాదు ..!
ఒక సైద్దాంతిక బలంతో గుండెలో దించుకోవాలి ..!

తారలు మరీనా తరగని నిజాయితీ అనే మన ఆస్తిని మన బిడ్డలకు వదలి వెళ్ళాలి ….!

అస్తమించిన ప్రతి చుక్క కూడా ,
ఉదయించే సూర్యుని విప్లవ నినాదం ,,!
మల్లి మనలో పుట్టాలి ..!
మన తరానికి భావి భారతానికి ఇదే రాజకీయ శాసనం అవాలి…!

మీరు చేయగలరా …?
అలా అయితే నీ ఊరికి నీవే పవన్ కళ్యాణ్
మార్పు చేసి చూపించు ..!
మార్పు కోసం జీవించు ..!
జనసేన సైనికుడివై జనసేన సైనికురాలివై….

@జనసేన సైనికురాలు ప్రియారాణి గుంటూరు

 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!