త్వరలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం..!

హైదరాబాద్ : జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగనుంది. వేగవంతంగా సభ్యులు నమోదు అయ్యేలా జనసేన ఐటి విభాగం తయారు చేసిన వివిధ సాఫ్ట్ వెర్లను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పరిశీలించారు. కొన్ని సవరణలు చేస్తూ జనసేన అధినేత ఐటి విభాగానికి సూచనలు తెలిపారు లోగోలు , పొందుపరచవల్సిన వివరాలపై వారికీ నివేదించారు.

ఈ రోజు చూసిన ట్రయిల్ వెర్షన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సానుకూలత వ్యక్తం చేసినట్లుగా జనసేన వర్గాలు తెలిపాయి. త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించాలని జనసేన పార్టీ ప్రతినిధులకు ఆదేశాలు జారీ చేసారు.
పవన్ కళ్యాణ్ గారు తెలిపిన వివరాలు ఈ వీడియో లో
~adding~

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!