గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బందికి అండగా జనసేన కార్యకర్తలు..

గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి గత 6నెలలుగా జీతాలు చెల్లించడంలేదు. సెక్యూరిటీ సిబ్బంది మొత్తం మద్యతరగతి, పేద వాళ్ళూ అయి ఉండటంతో వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. యాజమాన్యాన్ని ఎంత వేడుకున్నా స్పందించక పోవడంతో ఎవర్ని సంప్రదించాలో తెలియక అధికార, ప్రతిపక్ష పార్టీల మీద నమ్మకం లేక గుంటూరు జనసేన కార్యకర్తలని కలవడం జరిగింది.

వాళ్ళు అడిగిన వెంటనే స్పందించిన జనసేన కార్యకర్తలు బండ్రెడ్డి చందుగారు అండ్ టీం బాదితులను కలిసి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకొని యాజమాన్యాన్ని నిలదీయడం జరిగింది. పేద ప్రజలు, మద్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గిరిచేస్తే జనసేన చూస్తూ ఊరుకోదని సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఈ విషయాన్ని జనసేన పెద్దలకు తెలియజేస్తామని తెలిపారు.

ఒకవేళ సమస్యను యాజమాన్యం  పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి ద్రుష్టి వరకు తీసుకెళతామని బాధితులకు హామీ ఇచ్చారు. విషయాన్ని గమనించిన యాజమాన్యం వెంటనే స్పందించి ఇప్పుడు 2నెలల జీతాన్ని వెంటనే చెల్లిస్తామని మిగతా 4నెలల జీతాని 15రోజుల వ్యవధిలో చెల్లిస్తామని హామీని ఇచ్చారు.

ఈ విషయం తెలుసుకున్న భాదితులు జనసేన కార్యకర్తలను అభినందించి తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు. రాబోయే రోజుల్లో జనసేన ఇలాంటి కార్యక్రమాలని చేసి మాలాంటి వాళ్లకు ఉపయోగపడాలని ఇంతటి సహాయం చేసిన పార్టీని గుర్తుపెట్టుకుంటామని తెలిపారట..

ఈ కార్యక్రమంలో బండ్రెడ్ది చందు, హరి, మాధవ్, కిరణ్, శివా, ఏడుకొండలు, సాయి, తదితర జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

గుటూరుజిల్లా జనసేన పార్టీ..

Writer

Kiran Kumar

Janasena Party Vijayawada

One thought on “గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సెక్యూరిటీ సిబ్బందికి అండగా జనసేన కార్యకర్తలు..

  • 11/22/2017 at 3:37 సా.
    Permalink

    Jai janasena.మనకు మన నాయకుడు నెరింఎ్చిది
    సేవ, సమస్య మీద పోరాటం.

    Reply

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!