గుబ్బాల సతీష్ అనే జనసేన కార్యకర్తకు అండగా నిలిచిన జనసేన సైనికులు..

అనారోగ్యంతో భాదపడుతున్న గుబ్బాల సతీష్ అనే జనసేన కార్యకర్తకు గతంలో జనసేన కర్యకర్తలు 400,000రూ ఆర్ధిక సహాయం చేశారు. గుబ్బాల సతీష్ చికిత్స నిమిత్తం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని చంద్రికా ఆయుర్వేద హాస్పిటల్ లో చేరారు. చికిత్స చేసి నయం చేస్తామని చెప్పిన హాస్పిటల్ సిబ్బంది మొత్తం డబ్బులు తీసుకొని చికిత్స పూర్తి కాకుండానే దౌర్జన్యం చేసి పేషెంటుని బెదిరించడం జరిగింది. ఈ విషయాన్ని మన జనసేన కార్యకర్తలకు తెలియపరచగా వెంటనే స్పందించి పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చి సిబ్బంది చేస్తున్న అన్యాన్ని వెలుగులోకి తెచ్చారు. పోలీసులు స్పందించి వాళ్లకి తిరిగి నష్టపరిహారన్ని చెల్లించాలని కోరడం జరిగింది. పోలీసుల, జనసేన కార్యకర్తల చొరవతో హాస్పిటల్ సిబ్బంది 1,50,000రూ తిరిగి చెల్లించడం జరిగింది.

ఈ కార్యక్రమoలో జనసేన కార్యకర్తలు కార్తీక్, బిట్ల రమేష్, సంతోష్ , మిర్యాల రామక్రిష్ణ , గోకుల రవీందర్ రెడ్డీ, భాస్కర్, లక్ష్మీనారాయణ, అజయ్, సంతోష్, అరవింద్, భాను , నాగరాజు, రత్నసాయి, తదితరులు పాల్గొనడం జరిగింది.

హైదరాబాద్ జనసేన పార్టీ..

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!