69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్ధులకు ఎక్జామ్ స్టేషనరీ పంపిణీ చేసిన కొత్తపేట జనసేన కార్యకర్తలు..

69 వ గణతంత్ర దినోత్సవ సందర్బంగా కొత్తపేట నియోజక వర్గం, కొత్తపేట మండలం, కొత్తపాలెం గ్రామ Z. P. P. హైస్కూల్ లో ఉపాధ్యాయ, విద్యార్థులు నిర్వహించిన గణతంత్ర వేడుకలలో పాల్గొన్న జనసేన కార్యకర్తలు పబ్లిక్ పరీక్షలకు వెళ్తున్న 10 వ తరగతి విద్యార్థులకు ఎక్జామ్ స్టేషనరీ పంపిణీ చేశారు. రిపబ్లిక్ డే ని మనం ఒక పండగగా జరుపు కోవడమే గాక ఈ పండగకు జరుపు కోవడానికి ప్రాణత్యాగం చేసి అమర వీరుల ఆశయాలను, మన రాజ్యాంగ సిద్ధాంతాలను మనం గౌరవించి వాటిని ముందుకు తీసుకు వెళ్ళవలసిన బాధ్యత ప్రతీ భారతీయుడిది అని, దేశం సమగ్రత కు ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాలని జనసేన కార్యకర్త చిక్కం శివాజీ నాయుడు విద్యార్ధులకు తెలియజేసారు. ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు అడపా ఆనంద్, కంకటాల పవన్ మణికంఠ, ముద్రగడ లక్ష్మణ్, ఉద్దగిరి సాయి, dsp నాయుడు, గోకరకొండ దొరయ్య, గందిపూడి చిన్ని,గుర్రాల స్వామి, నిమ్మకాయల సాయి,ధవళ సురేష్, బోనం సాయిబాబా, నెందునూరి నాగరాజు, ఏపూరి చిన్ని, తెలగరెడ్డి శరత్ పవన్, గవర మణికంఠ, తిరుపతి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

 

జనసేన పార్టీ కొత్తపేట నియోజికవర్గం.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!