ప్రత్యేక హోదానే ప్రధాన అస్త్రంగా జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ

హైదరాబాద్ : జనసేన పార్టీ ప్రత్యేక హోదా విషయంలో మొదటి నుండి ప్రజలకూ చేరువ అవుతోనే ఉంది…2014 లో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీపై కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ అనుసరిస్తున్న తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు ఆవేదన వ్యక్తం చేసారు.

అయితే ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ మిన్న అని ఆంధ్రప్రదేశ్ ప్రజలను మభ్యపెడుతూ బీజేపీ , టీడీపీ పార్టీలు కలిసిగట్టుగా ఆడుతున్న నాటకాన్ని గమనిస్తున్న పవన్ త్వరలో సమాధానం చూపేందుకు సిద్ధం అవుతున్నారు. మరిక్రొద్ది రోజుల్లో జనసేన పార్టీ నిర్మాణం పూర్తి కానున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా విషయంలో ఒక్క కీలక నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ ఈపాటికే తీసుకున్నారని తెలుస్తోంది. జనసేన పార్టీ ప్లినరీ సమావేశంలో పవన్ ప్రత్యేక హోదా ఉద్యమంపై ప్రకటన చేయనున్నారని సమాచారం…

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!