జనసేనపై టీడీపీ ఎత్తుగడకు ఈ 30 లక్షల కొత్త ఓటర్లే కారణమా..!

విజయవాడ : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై కొందరు టీడీపీ నేతలు చేస్తున్న వాఖ్యలు తెలుగు రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. 2014 లో టీడీపీ మద్దతు ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ పై ఇలాంటి వాఖ్యలు చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 30 లక్షల మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నట్టుగా ఈసీ గణాంకాలు చెప్తున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ , వైసీపీ మధ్య 2 లక్షల ఓట్లు వెత్యాసమే , జనసేన పార్టీకి యువతలో ఆదరణ ఎక్కువ ఉండడం టీడీపీ కలవరపాటుకు కారణం అని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కు అడ్డుకట్ట వేసేందుకు టీడీపీలో సీనియర్ బృందానికి ఆదేశాలు ఉన్నట్టుగా సమాచారం…జనసేన ప్రారంభించిన విద్యార్థి విభాగంలాగే టీడీపీ విద్యార్థి విభాగం ఏర్పాటు చేయనున్నారు అంట…అయితే ఈపాటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన సన్నిహిత వర్గంతో సమావేశం అయ్యారు..టీడీపీ నేతలు చేస్తున్న వాక్యాలను త్రిపికొట్టే అంశాలపై కేడర్ కు ఒక్క సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!