పవన్ అగ్రికల్చర్ విద్యార్థులకు ఊరట..!

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ పెద్దలు స్పందించకుండా దటవేస్తున్న అనేక సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. సమస్య త్రివ్రతను బట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తూ , హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పవన్ స్పందించిన అనేక అంశాలు కార్యరూపం దాల్చుకొని విజయాన్ని సాధిస్తున్నాయి. దీనితో ప్రజలలో పవన్ కళ్యాణ్ జనసేనకి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

అయితే వారం క్రితం జీవో నెంబర్ 64 ని రద్దు చేయాలని అగ్రి విద్యార్ధులు పవన్ కళ్యాణ్ గారిని కలవగానే, పవన్ ఆ జీవోని రద్దు చెయ్యాలని ప్రభుత్వానికి లేఖ రాయడమేగాక, చేయని పక్షం లో ఉద్యమిస్తాను అని పవన్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే , దాంతో దిగివచ్చిన ప్రభుత్వం 64 జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ విషయంపై జనసేన కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!