చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సత్కారాలు పొందిన జనసేన కార్యకర్తలు

విశాఖపట్నం : సెప్టెంబర్ 2న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలలో భాగంగా విశాఖపట్నం లో శ్రీ పవన్ కళ్యాణ్ న్యూ లైఫ్ ట్రస్ట్ ఆధ్వర్యం లో ఆర్గాన్, బ్లడ్ అండ్ బాడీ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది.ఈ క్యాంపు లో 50 మంది కి పైగా జనసేన సైనికులు రక్తదానం చేసారు.

అయితే నిన్న సెప్టెంబర్ 6 బుధవారం నాడు రక్తదానం చేసిన వారందరిని ట్రస్ట్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ శ్రీ మోలబంటి రాఘవరావు గారు అభినందించి, సత్కరించి వీరందరికీ జ్ణాపికలు, సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం జయప్రదం చేసిన పూసపాటి భరత్ రాజు,బండారు వెంకటమణి, PVN రాజు, P.సునీల్,P. సందీప్ , రమేష్ నీలపు,M. సుశీల మరియు జనసేన కార్యకర్తలు,పవన్ అభిమానులకు అభినందనలు తెలిపారు.

 

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!