అమ్మాయి రేప్ అంటే న్యూస్ కవరేజ్ ఇచ్చే చానల్స్.. చిన్నారి ప్రాణం భలికి న్యూస్ కవరేజ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి..??

దత్తలూరు మండలం ముత్తురాజుపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో హేమలత అనే చిన్నారి తేలు కాటుకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్షం వల్ల మరణించింది.

తేలు కాటుకు గురై చిన్నారి మరణం. పాము కాటుకాదు తేలుకాటు ఒక చిన్నారి ప్రాణం బలి. ఆంద్రప్రదేశ్ అభివ్రుద్దిలో దూసుకుపోవడం అంటే ఇదేనా. తేలు కాటుకు మందు అందించలేని దౌర్భాగ్య పరిస్థితిలో మన ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందా..?? ఎంతసేపు సింగపూర్ రాజధాని, సింగపూర్ రాజధాని అని పరుగులు పెట్టే మన ప్రభుత్వం సామాన్యులకు అందించవలసిన చిన్న చిన్న వైద్యసదుపాయాలను అందించలేకపోవడం దేనికి సంకేతం.

అనవసరమైన చెత్త డిబేట్లను చూపించే మన న్యూస్ చానల్స్ గత 5రోజుల నుండి దీక్షలు చేస్తుంటే ఒక్కసారి కూడా టెలీకాస్ట్ చెయ్యలేకపోవడం దారుణం. ఒక ఆడపిల్ల బట్టలు చింపిన ద్రుశ్యాలను పొద్దున నుండి రాత్రి వరకు టెలికాస్ట్ చేసిన న్యూ చానల్స్ ఒక చిన్నారి ప్రాణం కోల్పోతే దానికి నిరసనగా దీక్షలు చేస్తుంటే చూపించలేకపోయాయంటే ఇంతకన్న సిగ్గుచేటు ఇంకోకటి ఉండదు. ఆడపిల్ల బట్టలు చింపిన ద్రుస్యాలు ఐతే టీ.ఆర్.పీ రేటింగ్స్ పెరుగుతాయ్ అదే చిన్నరి ప్రాణం గురించి వేస్తే ఎవరు చూస్తారు అనా..?? మీరా మెరుగైన సమాజం అందించేది సిగ్గు సిగ్గు..

ప్రభుత్వం కోసం పనిచేసే చానల్స్ కొన్ని.. ప్రతిపక్షం న్యూస్ మాత్రమే కవర్ చేసే చానల్స్ కొన్ని.. డబ్బుకోసం టీ.ఆర్.పీ రేటింగ్స్ కోసం పనిచేసే చానల్స్ కొన్ని. మరి ప్రజల కోసం పనిచేసే చానల్స్ ఏవి..?? ఎప్పుడు వస్తాయ్..?? అసలు మనం బ్రతికి ఉండగా చూడగలమా..??

Written by

Kiran Kumar

Janasena Party Vijayawada

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!