టీడీపి, బిజెపిలను ఏకేసిన పవన్ కల్యాణ్

టీడీపి, బిజెపిలను ఏకేసిన పవన్ కల్యాణ్

అమరావతి: బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి లేఖలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. టిడిపి, బిజెపి దాగుడు మూతలు ఎన్నాళ్లని ఆయన శనివారం ప్రశ్నించారు. ఇదిలావుంటే, అమిత్ షా లేఖపై చంద్రబాబు శాసనసభలో చేసిన వ్యాఖ్యలపై సోము వీర్రాజు స్పందించారు. చంద్రబాబుపై ఆయన ఎదురు దాడి చేశారు. అమిత్ షా లేఖలో ప్రస్తావించిన అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు.

రాష్ట్ర పరిస్థితి ఇదీ హోదా ఇచ్చే స్థితిలో బిజెపి, సాధించే స్థితిలో టిడిపి లేవని అమిత్ షా, చంద్రబాబు లేఖలను బట్టి అర్థమవుతోందన పవన్ కల్యాణ్ అన్నారు. టిడిపి, బిజెపి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రత్యేక ోదా తప్ప మరోటి వినే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని ఆయన అన్నారు

ఆ లెక్కలు చెప్పాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో కమిటీ వేసి నిధుల కేటాయింపు, ఖర్చులపై లెక్కలు తేల్చాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తాజా పరిస్థితిపై వామక్షాలతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!