అక్టోబర్ నుండి పవన్ రాజకీయ ప్రస్థానం అసలు కారణం..?

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2014 లో ప్రశ్నించేందుకు జనసేన పార్టీని ప్రారంభించి ప్రజలలో తనదైన ముద్ర వేసుకున్నారు. 2014 నుంచి రాజధాని భూముల విషయం మొదలు మధ్యలో అనేక ప్రజా వ్యతిరేక సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే 2016 నుంచి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలను ముందుగానే తెలుసుకుంటూ ప్రశ్నిస్తూ , పోరాటాలకు సిద్ధం అంటూ విజయకేతనలు వేగురవేస్తుంది.

అక్టోబర్ నెల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయ వేత్తగా ఉంటానని ఇదివరకే ప్రకటించారు. అయితే జనసేన వర్గాల నుండి వినబడుతున్న సమాచారం ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2018 మార్చ్ నెలలో జనసేన పార్టీ నిర్మాణం పూర్తి అయి కేడర్ బలోపేతం తర్వాతే పూర్తి స్థాయిలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించేందుకు సిద్ధం అయ్యారు..కానీ కొన్ని ప్రజా కారణాల దృష్ట్యా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుగా అంటే అక్టోబర్ నెల నుండే తన రాజకీయ బాటలు బలంగా వేయనున్నారని తెలుస్తోంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

error: Content is protected !!