ఈరోజు జ్యోతీరావు పూలే గారి 127వ వర్దంతి సందర్భంగా నివాళులు అర్పించిన విజయవాడ జనసేన సేవాదళ్ సభ్యులు.

జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే మహారాష్ట్రా లోని సతారా జిల్లాలోని మాలి కులానికి చెందిన కుటుంబంల. జన్మించాడు ఈయన తండ్రి గోవిందరావ ఒక కూరగాయల వ్యాపారి. తల్లి ఇతనికి 10 నెలల పసిప్రాయంలోనే చనిపోయింది. ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న వెంటనే ఫులే చదువు మానేసి తన తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయపడాల్సి వచ్చింది. 3 సంవత్సరాల వయసులోనే వివాహం చేశారు. ఇతని భార్య సావిత్రి పూలే.

గాంధీజీ కంటే ముందే మహాత్మునిగా జన నీరాజనాలందుకున్న జోతీరావు ఫూలే. కులం పేరుతో తరతరాలుగా, అన్నిరకాలుగా అణచివేతకుగురెైన బడుగు, బలహీనవర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి, వారి హక్కుల కోసం పోరాడి, సాధికారత కల్పనకు కృషి చేసినమహనీయుడు మహాత్మ జోతిరావ్‌ గోవిందరావు ఫూలే. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన ఫూలే మహారాష్ట్రాక్రు చెందినవా డు. ఆయన భారతదేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం, పేద, అణగారిన, అంటరాని ప్రజల హక్కుల కోసంపోరాడా డు. మహారాష్టల్రోని పూణే జిల్లాలో ఖానవలి ప్రాంతంలో 1827 ఏప్రిల్‌ 11న జోతిరావ్‌ ఫూలే జన్మించాడు. ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవాడు. కాలక్రమేణా పీష్వా పరిపాలనాకాలంలో పూల వ్యాపారం చేయడంవల్ల వారి ఇంటి పేరు ఫూలే గా మార్పు చెందింది. జోతిరావ్‌కి సంవత్సరం వయస్సు రాకుండానే తల్లి తనువు చాలించింది.7 సంవత్సరాల వయస్సులో ఫూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. తరువాత చదువు మానివేసి వ్యవసాయంలో తండ్రికి సాయంగా ఉండేవాడు.

దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాలలాంటి వాళ్ళు అని చెప్పాడు. మహాత్మాఫూలే ఆధునిక భారతదేశ సమాజంలో అందరికంటే గొప్ప శూద్రుడు. హిందూ సమాజంలో అగ్రకులాలవారి బానిసలుగా బతుకుతున్న కిందికులాల వారిలో తమ బానిసత్వంపట్ల ఆయన చెైతన్యం రగిలించారు. సామాజిక ప్రజాస్వామ్యం సాధించటం భారత దేశానికి ముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన మహాత్మ ఫూలే తన గురువు అని డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ ప్రకటించారు. దక్షిణాఫ్రికా జాతీయోద్యమ నాయకుడు నెల్సన్‌ మండేలా భారతదేశ పర్యటనకు వస్తున్న సందర్భంలో ఆ మహనీయునికి సమర్పించాలని నిర్ణయించు కొన్న గౌరవ కానుక మహాత్మ ఫూలే రచించిన మహత్తర గ్రంథం ‘గులాంగిరి’. సమాజంలో వెనుకబడినవర్గాల ప్రజలు, మహిళల అభ్యున్నతికోసం చేసినకృషికి ఆయనకు ‘మహాత్మ’ బిరుదు ఇచ్చారు. దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ నిరంతరం సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మ ఫూలే 1890 నవంబరు 28న కన్నుమూశారు.

ఈ రోజు జ్యోతిరావు పూలె గారి 127 వ వర్దంతి ని జనసేన సేవాదళ్ విజయవాడ ఆధ్వర్యంలో జరిగింది .ముఖ్య అతిథిగా అమ్మిశెట్టి వాసు గారు పాల్గొని నివాళ్లు అర్పించారు .ఈ కార్యక్రమములో బొలిశెట్టి వంశీకృష్ణ ,ఠాకూర్ అజయవర్మ ,తమ్మినా లీల కరుణాకర్ ,రాఘవ ,సామినేని రాజశేఖర్ ,కటారి ఈశ్వర్ ,వెన్న ఏతాంధ్ర,అమ్మిశెట్టి సతీష్ ,కాళ్లపాలెం బుజ్జి ,మణికొండ వెంకటేష్ ,బందిరెడ్డి రవి ,జగన్ ,కృష్ణ , మొదలగు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

జనసేన పార్టీ విజయవాడ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!