గిరిజన విలేఖరి పై దాడి హేయమైన చర్య
శంకర్ నాయక్ పై దాడికి పాల్పడిన వైసీపీ
నేత బోయ తిప్పే స్వామిని తక్షణం అరెస్టు చేయాలి
దళిత గిరిజనులతో పెట్టుకుంటే తలారి రంగయ్య ఒంటిమి తథ్యం

కళ్యాణ్ దుర్గం, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 06
కళ్యాణదుర్గం పట్టణంలో విలేకరి శంకర్ నాయక్ పై కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తలారి రంగయ్య కార్యాలయంలో ఈరోజు ఉదయం 9:45 గంటల సమయంలో తనకు ఇవ్వాల్సిన డబ్బులు అడగడానికి వెళ్లిన శంకర్ నాయక్ ఫై కులం పేరుతో దూషించి దాడికి పాల్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయ తిప్పేస్వామి పై తక్షణ చర్యలు తీసుకొని అతని అరెస్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తక్షణం సస్పెండ్ చేయాలని కళ్యాణదుర్గం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత గిరిజన సంఘాల నాయకులు శరత్ బాబు నాయక్, ఆర్కే రాజు, తిప్పేస్వామి నాయక్, ధనుంజయ నాయక్, సాకే గురుమూర్తి, లక్ష్మీపతి నాయక్, రవీంద్ర నాయక్ పెద్ద ఎత్తున గిరిజన సంఘ పాల్గొని కళ్యాణదుర్గం నియోజకవర్గం లో దాదాపు దళిత గిరిజనులు ఓట్లు 60000 దాక్కున్నాయని తిప్పేస్వామి పై చర్యలు తీసుకొని పక్షంలో అందరూ కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తలారి రంగయ్యను ఓడిస్తామని వారు హెచ్చరిం