Janasena News Paper
రాజకీయంసినిమా

పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అవ్వాలని దేవుడు రాసిపెట్టి ఉంచాడు.

పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అవ్వాలని దేవుడు రాసిపెట్టి ఉంచాడు

 అమరావతి జనసేన ప్రతినిధి, మార్చి 23: జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్‌పై సీనియర్ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిగా చెబుతున్నానంటూ పవన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు మంచి క్రేజ్ ఉందని అన్నారు.

 

మనమంతా నటులేమనన్న పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా పవన్ కళ్యాణ్ కు అభిమానులు ఉన్నారని.. ఇది ఆయన అదృష్టమని సుమన్ వ్యాఖ్యానించారు. రాజకీయమైనా.. వ్యాపారమైనా కూడా ఆ దేవుడు రాసి పెట్టి ఉంచాలి.. మనం అంతా కూడా నటులమేనని అన్నారు. ఆ దేవుడు మనకు కొన్ని రోజులపాటు కొన్ని పనులు అప్పగిస్తాడన్నారు. మీరు చేసే పని నేను చేయలేదు.. నేను చేసే పని మీరు చేయలేరు అని సుమన్ చెప్పారు.

పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం అవ్వాలని రాసిపెట్టి ఉంచాడు 

జీవితంలో పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని దేవుడు రాసిపెట్టి ఉంచాడు.ఒడిశాలో నవీన్ పట్నాయక్ వరుసగా ఐదుసార్లు సీఎంగా ఉన్నారు. కంటిన్యూగా 25 ఏళ్లు ఆయనే ఉన్నారు. దేనికైనా ఒక ఎక్స్‌పైరీ టైం ఉంటుంది. ఆ టైమ్ వచ్చిన్పపుడు వెళ్లిపోతోంది. సినిమాల విషయంలో వచ్చేసరికి పవన్‌కు ఇప్పుడున్న ఫాలోయింగ్ ఇంక ఎవ్వరికీ లేదని సుమన్ చెప్పారు.

 ఏపీకి సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎం అవుతారంటే? 

పవన్ కళ్యాణ్‌కు ఎప్పుడు సీఎం స్థానం దక్కుతుంది. ఆ సందర్భం ఎప్పుడు వస్తుంది. క్యాస్ట్ ఇక్వేషన్ సెట్ అవ్వాలి. ఎప్పుడు చేయాలని జనాలు అనుకుంటారో.. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బ్యాలెన్స్ అవుతుంది. ఈ మనిషి వస్తే వాళ్లంతా ధైర్యంగా ఉంటారని ఎప్పుడు అనుకుంటారో అప్పుడు ఆయన అవుతారు. ఓ నటుడిగా పవన్ కు మంచి జరగాలని కోరుకుంటున్నా.. ఆరోగ్యం మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నా అని సుమన్ వ్యాఖ్యానించారు. కాగా, మెగాస్టార్ చిరంజీవికి, సుమన్‌కు బేధాభిప్రాయాలు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో సుమన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Related posts

Leave a Comment