పూర్వ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్ కంటాక్స్ ప్రిన్సిపాల్ చే “విజయసంకల్పం ప్రసాద్, రాధికా రాణి” కు ఉగాది జాతీయ పురస్కారం.
తిరుపతి జనసేన ప్రతినిధి, మార్చి 23: మానవ సేవయే మాధవసేవ నినాదంతో అలుపులేని సింహబలుడు వలె ఆలోచనతో తన తాత పూర్వ రైల్వే ఉద్యోగి ప్రేరణతో బతికితే పదిమందికి ఉపయోగపడే విధంగా సహాయ పడాలనే సంకల్పంతో గత ఏడు సంవత్సరాలనుండి సహాయ సహకారాలు చేయడమే కాకుండా ఎన్నో సమస్యాత్మక సమస్యలను అధికారులచే పరిష్కరిస్తూ..
కరోనా సమయంలో నిరుపేద జర్నలిస్టులకు నిత్యవసర వస్తువులు,రైస్ బ్యాగ్స్ తో పాటు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్స్ లకు మరియు జర్నలిస్టులకు శానిటైజర్లు,గ్లౌజస్లు,మాస్కులను అందించడమే కాకుండా..వీధుల్లో మేయర్,డియస్పి,సీఐ చేతుల మీదుగా కాలనీ వాసుల కూడా మాస్కులు,శానిటైజర్లు అందించినందుకు గాను జర్నలిస్టుల విభాగంలో విజయసంకల్పం ప్రసాద్ కు మరియు నిరుపేద కుటుంబీకులకు,వికలాంగుల ట్రస్టులకు తనవంతు సహకారంగా సహకారమందిన కేటగిరిలో …
ఉత్తమ ప్రతిభా విభాగంలో ఉగాది జాతీయ పురాష్కారానికి ఎంపికైన రాధికా రాణికి “విశ్వశ్రీ ఫౌండేషన్” ఆధ్వర్యంలో కళారత్న అవార్డు గ్రహిత,సిని గేయ రచయిత,సీనియర్ పాత్రికేయులు డా.బిక్కి కృష్ణ అధ్యక్షతన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పూర్వ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్ కంటాక్స్ ప్రిన్సిపాల్ నరసింహప్ప చేతుల మీదుగా ఉత్తమ జాతీయ పురస్కారాన్ని సామాజికవేత్త “విజయసంకల్పం ప్రసాద్” అందుకొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవన్ లాల్,శత చిత్ర నిర్మాత రామ సత్యనారాయణ,కళా తాటికొండ(అడ్వకేట్ &రచయిత్రి),పూర్వ ఉమ్మడి రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అధికారి రాజగోపాల్,కవులు,ఇతర విభాగాల ప్రముఖులు పాల్గొన్నారు.