
గన్నవరం, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 8:
గన్నవరం లో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కృష్ణ జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అష్మి , గన్నవరం డిఎస్పీ జయ సూర్య యొక్క అదేశాల పై గన్నవరం వివిధ ప్రదేశాలలో మద్యం సేవించి వాహనములు నడిపే చోదకుల పై డ్రైవ్ నిర్వహించిన గన్నవరం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వాసా పెద్ది రాజు వారి సిబ్బంది. 5 గురు వ్యక్తులు మద్యం సేవించి వాహనములు నడిపే చోదకులను గన్నవరం మేజిస్ట్రేట్ కోర్ట్ లో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి 05 గురు వ్యక్తులకు ఒకొక్కరికి రూ.10,000/- చొప్పున 50,000/- రూ .లు జరిమానా విధించడం జరిగింది. ఈ సందర్భముగా గన్నవరం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వాసా పెద్ది రాజు మాట్లాడుతూ… డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించి పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి వాహన చోదకులు ట్రాఫిక్ నియమ నిబంధనలు, మోటార్ వాహన చట్టాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణం చేయాలని గన్నవరం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెలియ చేసినారు.