శ్రామిక మహిళా దినోత్సవ పోరాటాన్ని ఎత్తిపడుదాం
భగత్ సింగ్ 92 వ వర్ధంతి సభలో పీఓఢబ్ల్యూ(విముక్తి)రాష్ట్ర నాయకురాలు ఎం.పుణ్యవతి పిలుపు
పీడీఎం చంద్రమౌళి, అతని కుమారుడుపై పెట్టిన ఉపాను వెంటనే తొలగించాలని తీర్మానం.

జవహర్ నగర్, జనసేన ప్రతినిధి, మార్చి 23: కామ్రేడ్ భగత్ సింగ్ పోరాట స్పూర్తితో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ పోరాటాన్ని ఎత్తిపడుదాం అని ప్రగతిశీల మహిళా సంఘం(పీఓఢబ్ల్యూ-విముక్తి) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు పుణ్యవతి శ్రామిక ఉత్పత్తి వర్గాల ప్రజానీకానికి పిలుపునిచ్చారు. మార్చి-23, 2023 న గురువారంరోజు, మేడ్చల్-మల్కాజిగిరి, కాప్రా, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలాజీనగర్, వెంకటేశ్వర కాలనీలోని మా గ్రుహలక్ష్మీ సేవా సంఘం కార్యాలయంలో కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్ 92 వ వర్ధంతిని పురస్కరించుకుని అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్ససభ జరిగింది.
మార్చి-8 నుండి 31 జిల్లాల వారిగా 113 వ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్స కార్యక్రమాలను జరపండి అని పీఓఢబ్ల్యూ రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ ఇచ్చిన పిలులో బాగంగా జరిగిన సభకు మా గ్రుహలక్ష్మీ సేవా సంఘం సభ్యురాలు షేక్ యాశ్మీన్ బేగం అధ్యక్షతన జరిగింది. ఈపై కార్యక్రమంలో ఇఫ్టూ జాతీయ కార్యదర్శి షేక్ షావలి, రీయాన్ ఇంటర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షురాలు ముత్తు గీతాంజలి, లక్ష్మీ శర్మ, సావిత్రి బాయ్ పూలే మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ అల్లూరి సావిత్రి, తెలంగాణ వికలాంగుల ఐక్య వేదిక అధ్యక్షులు మభ్భు బాలు, ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు ఎం.డి.పాషామియా, మా గ్రుహలక్ష్మీ సేవా సంఘం కార్యదర్శి ఎస్. నవనీత, మన స్నేహం ఎన్.ఎస్.గ్రూప్ వ్యవస్థాపకులు కావేరి, తెలంగాణ నవ సమాజ సంఘం అధ్యక్షుడు మహ్మద్ జావేద్, సిరి, మంజుల, వరమ్మ, సుజాత, ఉప్పలమ్మ తదితరులు హాజరై ప్రసంగించారు. భగత్ సింగ్, రాజ్ గురు, సఖ్ దేవ్ కన్న కలలుగానీ, సమాన పనికి సమానవేతనం, స్త్రీ పురుష సమానత్వంగానీ ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నెరవేరలేదని గుర్తు చేసుకున్నారు.

శ్రామిక మహిళలు పనిప్రదేశాలలో పలు శారీరక మానసిక పరమైన లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా సంఘటితంగా ఉద్యమించాలని కోరారు. ప్రేమ పేరుతో జరుగుతున్న దాడులు, వరకట్న దరాచారాలను రూపుమాపెందుకు అన్నివర్గాల మహిళలు ముందుండి పోరాడాలని పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పౌర ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణతోపాటు తమ హక్కుల సాధనకు శ్రామిక మహిళలు అత్యంత చైతన్య వంతంగా ఉద్యమించాలని కోరారు.
అనంతరం భగత్ సింగ్, రాజుగురు, సుఖ్ దేవ్ లకు రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనమైన విప్లవ నివాళులు అర్పించారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమాల్లో ముందుండి పోరాడుతున్న పీడీఎం చంద్రమౌళిని, లా చదువుతున్న అతని కుమారుడు ప్రుద్వీరాజుపై మార్చి-20న ములుగు వెంకటాపురం పోలీసులు నమోదుచేసిన ఉపాను ఎత్తివేయాలని సభలో తీర్మానించారు.