అత్యవసర పరిస్థితుల్లో నెలలు నిండని గర్భిణికి పురుడు పోసిన కీసర 108 సిబ్బంది..
తల్లి, బిడ్డల్ని ప్రాణాప్రాయ పరిస్థితిని నుండి కాపాడిన ఈ.ఎమ్.టి చిత్రం రవి…
జనసేన ప్రతినిధి కీసర డిసెంబర్ 03
మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధిలోని దమ్మాయిగూడలో నివాసం ఉంటున్న సయ్యిద్ జరీనా బేగం వయస్సు 23 సంవత్సరాలు, అనే 6 నెలల గర్భిణి ఇంట్లో మెట్లు దిగుతుండగా కాలు జారీ మెట్ల మీద పడి పోయింది, మెట్లకు కడుపు గట్టిగా తగలడంతో ఆమెకి తీవ్ర కడుపు నొప్పి వచ్చింది.
దీనితో అమే కుటుంబ సభ్యులు వెంటనే 108 కు సమాచారం అందిచ్చారు, సమాచారాన్ని అందుకున్న కీసర 108 సిబ్బంది ఈ.ఎమ్.టి చిత్రం రవి, పైలట్. ఆంజనేయులు వెంటనే హుటహుటీన సంఘటన స్థలానికి చేరుకొని, తీవ్ర కడుపు నొప్పి తో బాధ పడుతున్న గర్భిణి మహిళను అంబులెన్స్ వాహనంలోకి తీసుకోని ఆమెకి అత్వవసర వైద్య పరీక్షలు నిర్వహించి, కడుపులోని బిడ్డ కదలికలు సరిగా లేవు అని గమనించిన ఈ.ఏం.టి. రవి వెంటనే 108 కాల్ సెంటర్ లో ఉన్న అత్యవసర వైద్యులు డాక్టర్, దుర్గా ప్రసాద్ కి గర్భిణీ మహిళ పరిస్థితిని పోన్ లో వివరించారు,
అప్పుడు డాక్టరు గర్బంలో ఉన్న బిడ్డకు ప్రాణ ప్రాయ పరిస్థితిని ఉంటుంది అని తెలిపారు, వారు చేసిన సూచనలను, సక్రమంగా అమలు చేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో ఆమెకి అందించాల్సిన వైద్యాన్ని సమర్ధవంతంగా అందిస్తూ ఆమెనీ నగరంలో గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నాగారం సమీపంలోకి రాగానే నొప్పులు అధికం కావడంతో, నెలల నిండని గర్భిణీ ప్రసవం చెయ్యాల్సి వచ్చింది,
ఆ సమయంలో ఎన్నో అత్వవసర పరిస్థితుల్లో ప్రసవాలు చేసిన అనుభవం ఉన్న కీసర,108 సిబ్బంది ఈ. ఏమ్. టి చిత్రం రవి ఉండడం వలన ఆమెకీ మొదటి కాన్పు, మరియు నెలలు పూర్తీగా నిండని గర్భిణీగా ఉన్నా కానీ, మరియు మెట్ల మీద పడి బిడ్డా కదలికలు సరిగా లేనప్పటికీ, అలాంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా ఆమెకీ నార్మల్ డెలివరీ చేసి తల్లి, బిడ్డల్ని, ఇద్దరిని కూడా ప్రాణాపాయ పరిస్థితిని నుండి కాపాడి , నెలలు పూర్తిగా నిండని బిడ్డకు అంబులెన్స్ లో
అప్పుడే పుట్టిన మగ బిడ్డ సరిగా ఎదగక పోవడంతో హార్ట్ బీట్ తక్కువగా ఉండి, శ్వాస తీసుకోవడం కూడ సరిగా లేనప్పటికీ, అది గమనించి ఆ శిశువుకి సీ. పీ.ఆర్, అనే ప్రక్రియ చేస్తూ అత్యవసర పరిస్థితుల్లో అంబు-బ్యాగ్ తొ ఆక్సీజన్, ను మరియు కృత్రిమ శ్వాసను అందిస్తూ హాస్పిటల్ కు చేరే వరకు పుట్టిన బిడ్డకి ప్రాణ- ప్రాయ పరిస్థితి నుండీ కాపాడి, గాంధీ ఆసుపత్రికి చేరుకొని అక్కడి నవజాత శిశువుల డాక్టర్ల కు బిడ్డ పరిస్థితిని వివరించి, జరిగిన అత్యవసర పరిస్తీతిని పూర్తీగా వివరించి డాక్టర్లు కు చెప్పడంతో, వారు ఈ. ఏమ్. టి చిత్రం రవిని అబినందించారు, అలాగే జరీనా బేగం కుటుంబ సభ్యులు, కీసర 108 సిబ్బందిని కృతజ్ఞతలు తెలియజేశారు…