నేను సిద్ధం నీవు సిద్ధమా ఎమ్మెల్యే అనంతకు సవాల్ విసిరిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి
అనంతపురం జనసేన ప్రతినిధి ఏప్రిల్ 06: ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నీవు ఏ కాంట్రాక్టర్ వద్ద నుంచి డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తావా అని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి సవాలు చేశారు.గురువారం అనంతపురం అర్బన్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సిగ్గు లేదా,దద్దమ్మలు అని మాట్లాడుతున్నావు నీకు సిగ్గు లేదని,వయసు మీద పడ్డ ఎలా మాట్లాడాలో తెలియడం లేదన్నారు. నా 10 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని, పేర్కొన్నారు. నారాలోకేష్ పాదయాత్రలో జన సందోహం చూసి జీర్ణించుకోలేక ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని దుయ్యపట్టారు.మున్సిపల్ చైర్మన్ గా నేను చేసిన అభివృద్ధికి అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు అభినందించి,అనంతపురం మున్సిపాలిటీని ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారని తెలిపారు.విభజన హామీల లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనంతకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కేటాయించిందని, దాన్ని మేము పూర్తి చేశామని, తిరిగి ఎన్నికలలో గెలవలేనందున ప్రారంభించలేదన్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితమంటున్నావు ఏనాడైనా ప్రజల సమస్యలపై పార్లమెంట్లో గాని శాసనసభలో గానీ మాట్లాడవా అని పేర్కొన్నారు.నగరంలో మున్సిపల్ చైర్మన్ గా ఎమ్మెల్యేగా నేనే అభివృద్ధి చేశానన్నారు. 72 ఎకరాలలో సెంట్రల్ పార్క్ ను, ఎమ్మెల్యే అయిన తర్వాత 100 ఎకరాల్లో అభివృద్ధి చేశానన్నారు. దాన్ని కూడా సుబ్రహ్మణ్యేశ్వర ట్రస్టుకు దార రక్తం చేయాలని చూసావని కోర్టు ఆర్డర్ ద్వారా అడ్డుకున్నానని లేకపోతే దానిని కూడా ఆక్రమించే వారని పేర్కొన్నారు. సూర్య నగర్ రోడ్డు హౌసింగ్ బోర్డ్ రోడ్డు బస్టాండ్ రోడ్ ఎన్టీఆర్ మార్గ్, రోడ్డు శ్రీనగర్ 80 ఫీట్ రోడ్డు, నేను అభివృద్ధి చేసినవే అన్నారు.
ఎమ్మెల్యే ఒక అబద్ధాల పుట్ట అని ఎద్దేవా
ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి ఒక అబద్ధాల పుట్ట అని ఎద్దేవా చేశారు. చౌకబారు రాజకీయాలు చేస్తూ మా మీద రకరకాల కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. మహిళలపై కూడా కేసులు పెట్టిస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని, ప్రభుత్వం రాగానే మేము కూడా కేసులు పెట్టిస్తామని హెచ్చరించారు.
మీ పార్టీ వారే నీ అవినీతి గురించి మాట్లాడుతున్నారు
మీ పార్టీ వారే నీ అవినీతి గురించి మాట్లాడుతున్నారని గుత్తి, సుభాష్ రోడ్డు, నిర్మాణంలో కాంట్రాక్టర్ నుంచి 30 కోట్లు తీసుకున్నామని మాజీ డిఎస్పి బాలనరసింహారెడ్డి పేర్కొన్నారని తెలిపారు. మరోవైపు మీ పార్టీ కార్పొరేటర్లే నీ అవినీతి గురించి చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు కార్పొరేటర్లు సమావేశంలోనే కింద కూర్చుని, అవినీతి గురించి, సమస్యలపై మాట్లాడుతున్న స్పందించడం లేదని ఎద్దేవా చేశారు. అనంతలో అభివృద్ధికి చిరునామా మేము గతంలో నగరంలో ట్రాక్టర్లతో నీళ్ళు తోలుకునే పరిస్థితి ఉండేదని, 20 సంవత్సరాల పాటు నీటిసమస్య రాకుండా 91 కోట్ల రూపాయలతో, 11 రిజర్వాయర్లు నిర్మాణం చేశామని, అదనపు పోలీస్ స్టేషన్, పిటిసిని ఎల్బీ స్టేడియం తరహాలో అభివృద్ధి , నగరంలో వేలాది చెట్లు విద్యుత్ సబ్ స్టేషన్లు, డ్వాక్రా మహిళలకు భవనాలు, 13 రేషన్ కార్డులు, వేల మందికి ఇళ్ల పట్టాలు అందించామన్నారు. దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్న ఏమి చేశారో చెప్పాలని పేర్కొన్నారు.
నీవు నేను ఇండిపెండెంట్ గా పోటీ చేద్దామా
పార్టీలు పక్కన పెట్టి ఇండిపెండెంట్ గా పోటీ చేద్దామని నాకంటే ఒక్క ఓటు నీకు ఎక్కువగా వచ్చిన రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చౌదరి సవాల్ విసిరారు. నీవు ఏ అవినీతికి పాల్పడలేదని, మీ ఇంటి దగ్గరే ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో ప్రమాణం చేస్తావా అన్నారు. మొదట నేనే ప్రమాణం చేస్తానని ఆ తర్వాత వచ్చి నీవు చేయగలవా అన్నారు. 9 నoబర్ల గురించి మీ నాయకులు మాట్లాడుతున్నారని మేము మాట్లాడడం లేదని పేర్కొన్నారు.