Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలు

అమలాపురం విద్వాసకాండ దోషులను కఠినంగా శిక్షించాలి

మంత్రి విశ్వరూప్ వ్యాఖ్యలు హాస్యాస్పదం అర్ధరహితం

ఓటుబ్యాంకు రాజకీయాలు మానుకోవాలి

ముఖ్యమంత్రి వద్దకు దళిత సంఘాలు వెళ్లే ప్రసక్తి లేదు

దళిత ఐక్యవేదిక, ప్రజా సంఘాలు

అమలాపురం, జనసేన ప్రతినిధి,ఏప్రియల్ 09: భారత రాజ్యాంగ నిర్మాత డా క్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును కోనసీమ ప్రాంతానికి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఒక ముందస్తు ప్రణాళికతో కొంతమంది అసాం ఘిక శక్తులు అమలాపురంలో అల్లర్లు చేశారు. రాష్ట్ర దళిత మంత్రి వెనుకబడిన వర్గానికి చెందిన ఎమ్మెల్యేల అధికారిక నివాసాలను తగబెట్టరు. వారి కుటుంబ సభ్యులు ఉండగానే మనుషులను సజీవ దహనం చేయాలని దురుద్దేశంతో అ త్యంత దారుణంగా గృహ దహ నాలకు పాల్పడి ప్రభు త్వానికి చెందిన రెండు బస్సు లను ఒక ప్రైవేటు బస్సును దగ్ధం చేసి, ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించారు. ఒక జిల్లా ఎస్పీ మరియు పోలీ సు సిబ్బందిపై దాడిచేసి గాయ పరిచి లక్షలాదిమంది ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన దేశవ్యాప్తంగా సంచలనంకలి గించినటువంటి దారుణ ఘట నకు కారకులైన నేరస్తులను అందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డాక్టర్ బి.ఆర్ అం బేద్కర్ కోనసీమ జిల్లా దళిత ఐక్యవేదిక మరియు యువ జన విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దమన కాండను మరియు అమలాపురం విధ్వం సకాండ నిరసిస్తూ దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివా రం అమలాపురం ప్రెస్ క్లబ్ నందు దళిత ఐక్యవేదిక చైర్మన్ డిబి లోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు మా ట్లాడారు. విధ్వంసం సృష్టించిన నేరస్తులందరినీ కఠినంగా శిక్షిం చాల్సిన ప్రభుత్వం దోషు లంద రూ అమాయకులని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. నిందితు లపై కేసులు ఎత్తివేస్తా మని ప్రక టన చేయడం చట్టా లను నీరు గార్చడమేనని ఆరో పించారు. విధ్వంసంలో నష్టపో యిన బాధిత రాష్ట్ర మంత్రి విశ్వరూప్ స్వయంగా నేరస్తు లను కాపాడే విధంగా ప్రకటన లు చేయడం దోషుల పైకేసులు ఎత్తివేయా లని ముఖ్యమంత్రిని కోరడం అన్యాయమని అన్నారు. వి ధ్వంసకారులకు మద్దతుగా మాట్లాడటం సిగ్గుచేటని దీనిని దళిత ప్రజాసంఘాలుగా ఖండి స్తున్నామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న విశ్వరూప్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నిందితు లను అమాయకులు అని వ్యా ఖ్యలు చేయడం హాస్యాస్పదం అని మంత్రి మాటలు అర్థర హితంగా దళితులను విస్మరిం చే విధంగా ఉన్నాయని అన్నా రు. దళిత సంఘాలను ముఖ్య మంత్రి వద్దకు తీసుకువెళ్తానని చెప్పడంలో ఆంతర్యం ఏమిట ని ప్రశ్నించారు.

దళిత సంఘా లు ముఖ్య మంత్రి వద్దకు వెళ్లేం దుకు ఎవరూ సిద్ధంగా లేరని నిందితులకు మద్దతుగా దళి తులను తీసుకువెళ్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్ప టికైనా మంత్రి దళితులను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు మానుకొని దళితుల సంక్షే మానికి కృషి చేయాలని హిత వు పలికారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రికే రక్షణ లేకపోతే రాష్ట్రంలో ఉన్న దళితులం దరికీ రక్షణ ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.నిందితులపై కేసులు ఎత్తివేయడం వల్ల దళి తులపై మరింత దాడులు చేసే ప్రమాదం ఉందని కావున రాష్ట్ర ప్రభుత్వం అమలాపురం విధ్వం సకాండ నిందితులను కాపాడే విధంగా తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకొని నింది తులందరినీ అరెస్టు చేసి కఠినం గా శిక్షించాలని ఘటనకు కార కులైన సూత్రధారులను గుర్తిం చి హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించా లని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు అరికట్టాలని దాడులకు పాల్ప డుతున్న అధికార పార్టీ నాయ కులతో సహా అందరిని అరెస్టు చేయాలని రద్దు చేసిన 28 దళి త సంక్షేమ పథకాలను పునరు ద్ధరించాలని డిమాండ్ చేశారు.

లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తా మని హెచ్చరించారు ఈ సమా వేశంలో దళిత ఐక్యవేదిక కన్వీ నర్ జంగా బాబురావు, గిడ్ల వెంకటేశ్వరరావు, రేవు తిరుప తిరావు, జక్కల అరుణ్ కుమా ర మెండు రమేష్ బాబు, పొల మూరి మోహన్ బాబు, నక్క సంపత్ కుమార్ బొంతు బాల రాజు, దేవరపల్లి శాంత్ కుమార్ జల్లి శ్రీను, శెట్టి బత్తుల తులసీ రావు, నాగబత్తుల నరసింహ మూర్తి, విప్పర్తి రమణ, గల్లా రాజేంద్ర, ఉబ్బన శ్రీను, ముత్త బత్తుల శ్రీను, పులపర్తి వెంకటే శ్వరరావు, కోట హనుమంత రావు, మెండి డేవిడ్ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment