భీమవరం జనసేన ప్రతినిధి ఏప్రిల్ 10: ప్రస్తుత కళలు – ఆదరణ – హరికథ ప్రాధాన్యత అనే అంశంపై స్థానిక త్యాగరాజ భవనంలో సోమవారం చర్చ గోష్ఠి నిర్వహించారు. హరికథ సప్తాహ మహోత్సవాలకు విచ్చేసిన ప్రముఖ వయోలిన్ విద్వాంసులు విజయవాడ ఏఐఆర్ పాలపర్తి ఆంజనేయులు మాట్లాడుతూ సంపూర్ణ ధ్యాన సంపద సంగీతంలోనే ఉందని, త్యాగయ్య అన్నమయ్య రచనలు మానవ జీవన మనుగడకు సందేశత్మకంగా రచించారని, ప్రాచీన కళ సంపద హరికథ అని, సప్త కళల సమాహారం హరికథ అని అన్నారు. ఏనాటికైనా ఈ హరికథలకు ఆదరణ తగ్గదని అన్నారు. ఆదిభట్ల నారాయణ దాసు హరికథ పితామహుడు అని, రామాయణ భాగవత గాధలను పండిత పామరులకు అర్థమయ్యేలా హరికథ రూపంలోని మలిచి హరికథకు పునాది వేశారని అన్నారు. హరికథ కూడా సంపూర్ణ ధ్యాన నిధి అని, 80 ఏళ్ళ తరువాత హరికధ సప్తహం నిర్వహించడం గొప్ప విశేషమని అన్నారు.
ప్రాచీన కళలకు మంచి రోజులు వస్తాయని, 104 ఏళ్ళ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు భీమవరంలో నిర్వహించడం మేము కూడా దశాబ్ద కాలంగా ఆ వేదికపై కచేరీ లకు వయోలిన్ వాయిస్తున్నామని అన్నారు. చెరుకువాడ వెంకట్రామయ్య, రంగసాయి మాట్లాడుతూ ప్రముఖ వ్యాపారవేత్త కారుమూరి నరసింహమూర్తి ఈ సంగీత శాస్త్రాన్ని భీమవరంలో ముందు పునాది వేశారని, భీమవరంలో కూడా మంత్రిప్రగడ లలితకుమారి, అర్ దుర్గాంబ, కొచ్చేర్ల రామకృష్ణ, ముధబకా మల్లేశ్వరరావు ప్రస్తుతం జీవించి ఉన్న కే మల్లేశ్వర భగవతరిణిలు హరికథలుగా కళా ప్రపంచానికి అందించారని అన్నారు. ఆదిభట్ల నారాయణ దాసు ఇదే వేదికపై హరికథ గావించారని అన్నారు.