భీమవరం లో టిడిపి నిరసన ర్యాలీ
భీమవరం జనసేన ప్రతినిధి ఏప్రిల్ 10: భీమవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో జగన్ సర్కార్ విద్యుత్ చార్జీల పెంపుపై భీమవరం ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని సబ్ స్టేషన్ వద్ద సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.నిరసన కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షురాలు, భీమవరం నియోజకవర్గ ఇన్చార్జ్ తోట సీతారామలక్ష్మీ మాట్లాడుతూ జగన్ తన పాదయాత్రలో తాను అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోనని అధికారంలోకి వచ్చాక ఏడుసార్లు విద్యుత్ చార్జీలను పెంచి 57,188 కోట్ల రూపాయలు లూటీ చేసి రాష్ట్ర ప్రజలను మోసగించారని విమర్శించారు.
ఈకార్యక్రమంలో వీరవాసరం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్,వీరవల్లి శ్రీనివాస్ భీమవరం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రేపు వెంకన్న, కౌరు పృధ్విశంకర్ భీమవరం పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, మెరగాలి నారాయణమ్మ గూడూరి సుబ్బారావు జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు మామిడిశెట్టి ప్రసాద్ మహిళా రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ నాయకులు ఎద్దు ఏసుపాదం ఎండి నౌషాద్ గంట త్రిమూర్తులు బొక్క సూరిబాబు అడిదెల చిరంజీవి మద్దుల రాము కోళ్ల నాగబాబు మైలాబత్తుల ఐజాక్ బాబు సయ్యద్ నాసిమాబేగం ఎండి షబీనా బి.పద్మ చల్లబోయిన సుబ్బారావు గూడూరి రామకృష్ణ పామర్తి వెంకటరామయ్య విజురోతి రాఘవులు చల్లబోయిన గోవింద్ పాల శ్రీరామదాసు పాల రామకృష్ణ పడమట సోమేశ్వరరావు భూపతిరాజు బుజ్జిరాజు లంకి చిన్ని సతివాడ హరిబాబు ఎలమంచిలి శ్రీనివాస్ ఎరక రాజు గోపాలకృష్ణంరాజు కడలి వాసు గండి భూషణం మేక వెంకటసుబ్బారావు కౌరు భాస్కరరావు బొత్స వెంకటరమణ నేదునూరి గంగాధర తిలక్ నల్లం గంగాధర్ అంగర వెంకటేశ్వరరావు ఆదిరెడ్డి గంగాధర్ సారిక ఆంజనేయులు దొంగ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.