అనర్హులకు అందే పథకాలను నిలిపివేయాలి…
పంచాయితీ కార్యదర్శి పై కాకినాడ జిల్లా రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు
రాయుడు మోజేష్ బాబు స్పందనలో ఫిర్యాదు
సామర్లకోట, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 10: కాకినాడ స్పందన కార్యక్రమంలో సామర్లకోట మండలం, పనసపాడు గ్రామంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై కలెక్టర్ కి సోమవారం కాకినాడ జిల్లా రాజ్యాధికార పార్టీ రాయుడు మోజేష్ బాబు ఫిర్యాదు చేసారు. అలాగే తప్పుడు, అనర్హుల పింఛన్లు తొలగించి నిజమైన నిరుపేదలకు పింఛన్లు అందజేయాలని కోరారు. సామర్లకోట మండలం పనసపాడు గ్రామానికి చెందిన సత్తి సత్యవతి తన భర్త వీరభద్రరావు లేటు ది. 11/8/2022, కాకినాడ జిజిహెచ్ ప్రభుత్వ హాస్పిటల్ లో క్యాన్సర్ తో చికిత్స పొందుతూ లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి ఫలితం లేక మరణించడం జరిగింది.
సెంటు స్థలంలో తమ పూరి గుడిసె కూలిపోయినా, ఆమె భర్త మరణించారని 9 నెలల కిందట నుంచి పనసపాడు గ్రామ పంచాయతీ సెక్రెటరీ దగ్గరికి, వైఎస్ఆర్ పార్టీ పలు గ్రామస్థాయి చోటా మోటా నాయకులకు చెప్పిన సరే ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆమె కు వితంతు లేక వృద్ధాప్యం పింఛనీ కలెక్టర్ ఇప్పించాలని కోరారు.. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా రాజ్యాధికార పార్టీ రాయుడు మోజేష్ బాబు మాట్లాడుతూ గ్రామపంచాయతీ లో ఇచ్చే పింఛన్లలో, పథకాలలో, ఇంటి ప్లానుల మంజూరు వంటి అనేక అంశాలలో అవకతవకలు జరుగుతున్నాయని వాటిపై జిల్లా కలెక్టర్ వారు పనసపాడు గ్రామపంచాయతీకి తక్షణమే వచ్చి ఎంక్వయిరీ స్వయంగా జరపాలని అభ్యర్థించారు.
అలాగే గ్రామంలో ప్రభుత్వ డాక్టర్లు ఇచ్చిన తప్పుడు వికలాంగుల సర్టిఫికెట్లు ద్వారా అధికార పార్టీకి చెందిన గ్రామ పార్టీ అధ్యక్షుల వంటి వాళ్లే కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నారని తెలిపారు. , అనధికారి లేఔట్లు, సేల్స్ బిల్డింగులు, గ్రామంలో పలు అక్రమ సెటిల్మెంట్లు చేసేవారికి పనసపాడు గ్రామ పంచాయితీ సెక్రెటరీ ముడుపులందుకొని చాప కింద నీరులా వ్యవహారాలు చక్క బెడుతున్నారని ఫిర్యాదు చేశారు. నిరుపేదలకు ఇచ్చే వృద్ధాప్య , వితంతు, ఒంటరి మహిళ, వికలాంగుల పింఛన్లు ధనవంతులకు అధికార పార్టీకి చెందిన కొంత మందికి కట్టబెట్టడం,అలాగే బదిరెడ్డి ఏసుబాబు లాంటి వాళ్లకు వికలాంగులు పింఛన్లు ఇవ్వడం చాలా విడ్డూరంగా ఉందని కలెక్టర్ కి వివరించారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నవరత్నాలు పథకాలు అంటూ గడపగడపకు ఇన్చార్జులు పోస్ట్మాన్ లాగా తిరుగుతున్నారని, సీఎం జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లు ఇంటింటికి అంటిస్తూ అనవసర ఆర్భాటాలు చేస్తున్నారనీ ఎద్దేవా చేశారు. కానీ, అర్హులైన నిరుపేదలకు పింఛన్లు పలు ప్రభుత్వ పథకాలు అందించడంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. వీటన్నటిపై కలెక్టర్ పూర్తిస్థాయిలో ఎంక్వయిరీ జరిపించి నిరుపేదలకు వితంతువులకు వృద్ధులకు వికలాంగులకు నిజమైన నిరుపేద అర్హులకు పింఛన్లు అందజేయాలని కాకినాడ జిల్లా రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు రాయుడు మోజేష్ బాబు డిమాండ్ చేశారు.