పెనుగొండ, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 10: ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మెరుకు . శ్రీ సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, పెనుకొండ నియోజకవర్గ ఇంచార్జీ బి కే పార్థసారథి ఆధ్వర్యంలో పెనుకొండ పట్టణం, బి టి ఆర్ కాలనీ వద్ద ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన తెలుగు తమ్ముళ్లు ఈ సందర్భంగా బికేపార్థసారథిమాట్లాడుతూ2014వసంవత్సరముముందు లోటు 1.2 మిలియన్ యూనిట్లు లోటు ఉండేది. 2019వ సంవత్సరము నాటికి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు లోటు నుండి మిగులు విద్యుత్ తెచ్చిన ఘనత మా నాయకుడిది అని తెలిపారు. 2019వ సంవత్సరము నుండి జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు 7 సార్లు విద్యుత్ చార్జీలు పెంచిప్రజలనడ్డివిరుస్తున్నారని తెలిపారు.
పవర్ ఫైనాన్సు కార్పొరేషన్ దద్వారా అప్పులు తెచ్చి మొత్తం రూ. 57,188 కోట్ల భారాన్ని విద్యుత్ వినియోగదారులపై మోపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జెన్కో, సీజిఎస్ లలో ఒక యూనిట్ విద్యుత్ సరాసరి రూ. 5/- లకే వస్తున్నది .కానీ ప్రభుత్వ సంస్థలలో విద్యుత్ ఉత్పత్తి చేయకుండా నిలిపివేసి కమిషన్ల కోసం ఒక యూనిట్ సరాసరి రూ.9/- పెట్టి బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసారు. బహిరంగ కొనుగోళ్లకు రూ.12,200 కోట్లు ఖ్జర్చు చేసారు. ఈ వేసవి కాలములో ప్రజలకు విద్యుత్ అంతరాయము లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి. దానికి తోడు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే 24 గంటలలోపు వాటిని పునరుద్ధరణ చేయాలని విద్యుత్ అధికారులను కోరారు. మోటర్లకు మీటర్లు బిగిస్తే వాటిని పగులకొడతామని బికెపార్థసారథి.హెచ్చరించారు ప్రజలకు రైతులకు సంబంధించిన విద్యుత్ సమస్యలపై తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలో వివిధ పదవులలో ఉన్న నాయకులు,అనుబంధ విభాగాల నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు,.