భువనగిరి జనసేన ప్రతినిధి మార్చి 10: సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు యువత కృషి చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు తంగెళ్ళఫల్లి రవికుమార్ కోరారు. సోమవారం స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద టి షర్ట్ లను ఆవిష్కరించారు. అనంతరం రవికుమార్ మాట్లాడుతూ రెండు వందల సంవత్సరాల క్రితం మహాత్మా జ్యోతిరావు పూలే కుల వివక్ష కు వ్యతిరేకంగా, అంటరానితనం నిర్మూలనకు మహాత్మా జ్యోతిరావు పూలే పునాది వేసారని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల సమన్వయ కమిటీ కన్వీనర్ మాటూరి అశోక్, రాష్ట్ర కమిటీ కో- కన్వీనర్ మిర్యాల శ్రీనివాస్,కో- ఆర్డినేటర్ జూకంటి ప్రవీణ్, దళిత ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కంచనపల్లి నర్సింగరావు, కో-కన్వీనర్లు కొడారి వెంకటేష్, రావుల రాజు, కొత్త నర్సింహ స్వామి, పిట్టల బాలరాజు, నాయకులు పచ్చర్ల జగన్, ముత్తు,బెండె శ్రీకాంత్,ఎర్ర శ్రీరాములు, చుక్కా స్వామి, గుండెబోయిన సురేష్,నక్కల చిరంజీవి,కూర వెంకటేష్,డాకూరి ప్రకాష్, చల్లగురుగుల రఘుబాబు, కాదూరి అచ్చయ్య,రచ్చ శ్రీనివాస్,చిరిగె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.