*సాగర్ నీటిని విడుదల చేస్తున్నాం*
జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
సత్తెనపల్లి: రైతాంగం ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని నాగార్జున సాగర్ కుడి కాలువకు నీతిని విడుదల చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
గత నాలుగు రోజులుగా ఈ విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు,తెలంగాణ అధికారులతో చర్చలు జరిపామన్నారు.రెండు సార్లు సిఎం జగన్ మోహన్ రెడ్డిని కలసి మాట్లాడనన్నారు. పంట ఎండిపోతే రైతులు ఆవేదన చెందుతారని, రైతు మాము మాడిపోతే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, రైతుల పక్షపాత ప్రభుత్వం మాదన్నారు.రైతులు నష్టపోతే విలవిలలాడుతామని చెప్పారు.ప్రతిపక్షాలు వ్యక్తిగత విమర్శలు చేశారని మండిపడ్డారు.ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నోటుకు ఓటు కేసులో భయపడి మన హక్కులను వదిలేసారని విమర్శించారు.
కొందరు కావాలని విమర్శిస్తున్నట్టు నేను మౌనంగా లేనని, కృష్ణ నీటి విడుదలనేది రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశమని, నీటి విడుదల కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడంతో చర్చలు సఫలం అవ్వటానికి కొత్త సమయం పట్టిందిన్నారు. ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటామన్నారు ఆయనతోపాటు రాష్ట్ర రైతు సలహా మండలి సభ్యులు కళ్ళం విజయభాస్కర రెడ్డి రూరల్ మండల కన్వీనర్ రాయపాటి పురుషోత్తమరావు ,పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్, మర్రి సుబ్బారెడ్డి తదితరులున్నారు.