February 22, 2025
Janasena News Paper
అంధ్రప్రదేశ్ఆన్నమయ్యతాజా వార్తలు

పోలీసులు తప్పు చేసిన శిక్షార్హులే.. ఏపీ పోలీసులపై ఫిర్యాదులకు కంప్లైంట్స్‌ అథారిటి ఏర్పాటు

 


 అన్నమయ్య జిల్లా, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28: అమరావతి : రాష్ట్రంలోని పోలీసులపై వచ్చే ఫిర్యాదులను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీని ఏర్పాటు చేసింది. పోలీస్‌ కంప్లైంట్స్‌ అథారిటీ సభ్యులుగా ముగ్గురు రిటైర్డు IAS, IPS అధికారులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. అథారిటీ సభ్యులుగా రిటైర్డ్ IAS ఉదయలక్ష్మి, రిటైర్డు IPS అధికారులు కెవిబి గోపాలరావు, బత్తిన శ్రీనివాసులు లను ప్రభుత్వం నియమించింది.

వీరు పోలీసులపై వచ్చే ఫిర్యాదులను నమోదు చేసుకుని విచారణ చేపడతారని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన జిల్లాల ప్రకారం ఉత్తరాంధ్ర జిల్లాలకు విశాఖపట్నం, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు రాజమండ్రి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు గుంటూరు, రాయలసీమ జిల్లాలకు కర్నూలు కేంద్రంగా కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రతి కేంద్రంలో ముగ్గురు రిటైర్డు డి.ఎస్.పి, అడిషనల్‌ ఎస్పీ స్థాయి అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..ఇది కదా సుపరిపాలనంటే అంటూ జగన్ సర్కార్ పై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఇలాంటి పాలన కావాలంటూ జగన్ ప్రభుత్వాన్ని కొనియాడారు.

Related posts

Leave a Comment