Janasena News Paper
తాజా వార్తలుతెలంగాణయాదాద్రి భువనగిరి

పేద ప్రజల అభివృద్దే తెలంగాణ ప్రభుత్వఏజెండా: బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర

 భువనగిరి, జనసేన ప్రతినిధి, ఏప్రిల్ 28 : తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరిగిన శ్రీశ్రీశ్రీ భగీరథ మహర్షి జయంతిలో పాల్గొని ప్రసంగించిన ఉపేంద్ర ఈ సందర్భంగా మాట్లాడుతూ భగీరథ మహర్షి ఎన్నో సంవత్సరాలు కఠోరమైనటువంటి తపస్సు చేసి గంగను దివి నుండి భువికి సాక్షాత్తు ఆ పరమశివుని మెప్పించి తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు భగీరథ మహర్షి అని అన్నారు. నేటి యువత భగీరథ మహర్షి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని తమ జీవితంలో కష్టించిఉన్నతమైన స్థితిలోకి రావాలని పిలుపునిచ్చారు.
భగీరథ మహర్షి ని ఆదర్శంగా తీసుకున్న కేసీఆర్ 14 సంవత్సరాలు మొక్కవోని ధైర్యంతో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఎత్తిన పిడికిలి దించకుండా, మడమదిప్పకుండా, ప్రజాస్వామిక పద్ధతిలో ఓటు అనే ఆయుధం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన యోధుడు కేసీఆర్ అని ఆయన అన్నారు 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తెలంగాణ ప్రదాత శ్రీ కేసీఆర్ అని అన్నారు.

నాడు భగీరథుడు తపస్సు చేసి దివి నుంచి గంగను భూమికి తీసుకు వస్తే నేడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ గ్రామానికి ఆ గ్రామంలో ఉన్న ప్రతి గడపకు మరియు ఆ గ్రామంలో ఉన్న ప్రతి గుంట భూమికి కూడా గోదావరి నది జలాలను తెలంగాణ రాష్ట్రమంతటా తాగు, సాగు, కి అందించిన మరో అపర భగీరధుడే మన కేసీఆర్ అని ఆయన అన్నారు. ఒకనాటి తెలంగాణ రాష్ట్రం బీడు భూములతో నెర్రెలు బారిన నేలతో సాగు తాగునీరు లేక తుమ్మ చెట్లు, సర్కార్ చెట్లు, మంగళగిరి చెట్లు ,మోదుగు చెట్లు ,లోటఫీస్ చెట్లు, డొక్కలు ఎండిపోయిన పశువులు, ఆత్మహత్యలు , ఆకలి చావులు, వలసలు, బూటకపు ఎన్కౌంటర్లుతో ఇబ్బంది పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం 9 సంవత్సరాల లోనే అనేక రంగాలలో దేశం ఆశ్చర్యపోయే విధంగా నెంబర్ వన్ స్థితిలోకి తీసుకొచ్చిన ఘనత  కేసీఆర్ దే అని ఆయన అన్నారు.

పేద ప్రజల అభివృద్దే ఎజెండాగా కొనసాగుతున్న పాలనలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, దళిత బంధు, రైతుబంధు, రైతు బీమా, గురుకుల పాఠశాలలు, కెసిఆర్ కిట్టు ,ఆసరా పెన్షన్లు, ఆత్మగౌరవ భవనాలు, 24 గంటల కరెంటు ,ఆత్మగౌరవ భవన నిర్మాణాలు , కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ ,లాంటి పథకాలతో పేద ప్రజలకు మేలు జరగాలని కెసిఆర్ పాలన కొనసాగిస్తున్నారని వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధిని అందించాలని పాలన కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు రాబోయే కాలంలో పేద ప్రజలకి సంక్షేమo,అభివృద్ధి అందిస్తున్న ప్రభుత్వానికే ప్రజల మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈరోజు తెలంగాణ అభివృద్ధిని చూసి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు రాబోయే కాలంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి భారతదేశంలో కూడా జరిగి, బీసీ ,ఎంబీసీ ,సంచార జాతులు, ఎస్సీ, ఎస్టీ ,మైనార్టీ, పేద ,తాడిత ,పీడిత వర్గాల అభివృద్ధి కొరకు కేసీఆర్ చేస్తున్నటువంటి భగీరథ ప్రయత్నానికి తెలంగాణ ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

Related posts

Leave a Comment