Janasena News Paper
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపే వరకు ఉద్యమాలు ఆపే ప్రసక్తే లేదు… వామపక్ష ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు

రాయదుర్గం జనసేన ప్రతినిధి మే 0 2: విశాఖ హుక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రేపటి రోజున రాయదుర్గంలో రాస్తరోక నిర్వహిస్తున్నామని ముందస్తుగా రాయదుర్గం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా CPIఅనంతపురం జిల్లా కార్యవర్గ సభ్యులు నాగార్జున పట్టణంలో పోలీసులు నోటీసులు అందించారుఅదేవిదంగా రాయదుర్గం మండలం వేప్పరాల క్రాస్ వద్ద *రాయదుర్గం పోలీసులు AIYF రాయదుర్గం తాలూకా ప్రధాన కార్యదర్శి కోట్రెష్ కీ ముందస్తునోటీసులు అందించారు వీరు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలను కార్మిక సంఘాలను కలుపుకొని రాష్ట్రంలో 30 మంది యువకుల బలిదానాలతో 57 మంది కమ్యూనిస్టు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఆనాడు విశాఖ ఉక్కును ఏర్పాటు చేసుకువడం తో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మంది కార్మికులు ప్రజలు విశాఖ ఉక్కు మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనోపాధిని పొందుతున్నాయి.

రాష్ట్రంలో అతిపెద్ద పరిశ్రమ అయినటువంటి విశాఖ హుక్కు ను ప్రైవేటీకరణ చేయడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రేపటి రోజున రాయదుర్గంలో రహదారులు దిగ్బంధనం చేస్తున్నామని పోలీసులు ముందస్తుగా నోటీసులు అందజేసి ఉద్యమాలను అణిచివేసే దిశగా అడుగులు వేయడం దుర్మార్గం మేం పోలీసులకు వ్యతిరేకులం కాము కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న వాటిపై ఉద్యమాలు సాగించడానికి ఏప్పుడు కూడా ముందుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా రేపటి రోజున తలపెట్టిన ఉద్యమాన్ని యధావిధిగా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము విశాఖ ఉక్కు ప్రైవేటీకారణ అప్పే వరకు ఉద్యమాలు అప్పే ప్రసక్తే లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ గా హెచ్చరిచారు.

Related posts

Leave a Comment