Janasena News Paper
అంధ్రప్రదేశ్తాజా వార్తలుతూర్పు గోదావరి

వికరాంగురాలిపై దాడి చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేయాలి..

ఏఐడిఆర్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ డిమాండ్

  రామచంద్రపురం, జనసేన ప్రతినిధి,  మే 02: మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులు వికలాంగురాలిపై దాడి చేసిన సంఘటన తమను కలిసివేసిందని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖండవిల్లి భరద్ కుమార్ ఆవేదన చెందారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ పరిధిలో మండాలమ్మపేటలో నివాసం ఉంటున్న పాలిక లక్ష్మి అనే వికలాంగురాలు పంచాయతీకి పన్ను చెల్లిస్తూ నివాసం ఉంటున్న స్థలం ఖాళీ చేయాలంటూ కొంతమంది వ్యక్తులు సోమవారం ఆమెపై దాడికి పాల్పడ్డారని వారి నుండి రక్షణ కల్పించాలని కోరుతూ సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసిందన్నారు.

తమపై ఫిర్యాదు చేసిందన్న కక్షతో మంగళవారం ఆమె ఇంట్లో ఉండగా కొంతమంది దౌర్జన్యంగా ఇంటి గోడను కూల్చి వేయడం దారుణమన్నారు. వికలాంగురాలి ఫిర్యాదు పై స్థానిక పోలీసులు తక్షణమే స్పందించి ఉంటే ఈ సంఘటన జరిగేది కాదన్నారు. ఆమెకు రక్షణ కల్పించడంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. వికలాంగురాలిపై దాడి చేయడమే కాకుండా ఆమె ఇంటి గోడను కూల్చిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు పిలిపిస్తామన్నారు. ఈ సంఘటనపై వివిధ పార్టీలకు చెందిన నాయకులు , ప్రజాస్వామికవాదులు ప్రజాసంఘాలు స్పందించాలని కోరారు.

Related posts

Leave a Comment