బలాబలాలు ఆధారంగా సీఎం పీఠం అనే మాటలతో మెలిక….
త్రిముఖ పోటీలో బలి కావడానికి సిద్ధంగా లేమని స్పష్టత..
ఎన్ని స్థానాలు పొత్తు లో వచ్చినా పోటీకి సిద్ధమవ్వాలని నిర్ణయం…
కాపు కాసి అన్ని స్థానాలు గెలిపించుకోవాలనే సిద్ధాంతం…
ఎన్నికల్లో సహాయ నిరాకరణతో టీడీపీని సాధ్యమైనంత తొక్కేయ్యాలనే సూత్రం…
తెలుగు దేశం పార్టీ వాళ్ళను సీఎం చేయడానికి సిద్ధంగా లేమని ముందే సంకేతాలు..
నిర్ణయాత్మక శక్తిగా నిలిచి సీఎం పీఠాన్ని అధిరోహించాలనే ప్రధాన లక్ష్యం.
జనసేన ప్రతినిధి, మంగళగిరి, మే 12: ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయ పార్టీల్లో సరికొత్త వ్యూహప్రతి వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. తాము అందించిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని అధికార పార్టీ వైసిపి ఆశలు పెట్టుకుంటే… మరోపక్క ప్రభుత్వం తీసుకుంటున్న నిరంకుశ విధానాల వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో వైసిపి పార్టీకి భంగపాటు తప్పదని తద్వారా తామే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని టిడిపి భావిస్తోంది. అయితే ఒంటరిగా వెళితే విజయం అంత సులభం కాదు అని తెలుసుకున్న టిడిపి జనసేన, బీజేపీ, వామ పక్షాలతో పొత్తు ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే తెలుగుదేశం, వైసీపీ పార్టీలకు చెక్ పెట్టి సీఎం పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా జనసేన పార్టీ సరికొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరి అంచనాలకు అందకుండా చాప కింద నీరులా వ్యవహారం చెక్కపెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే తాజాగా శుక్రవారం జనసేనాని చేసిన ప్రసంగం ప్రస్ఫుటంగా నూతన వ్యూహాలతో తెర వెనుక ఏదో సరికొత్త రాజకీయం చోటు చేసుకోబోతుందనే ఊహగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రసంగంలో పవన్ బలాబలాలు ఆధారంగా సీఎం పీఠం అనే మాటలతో విడదీయలేని మెలిక పెట్టారు.
ఓ పక్క తాను సీఎం అభ్యర్థి కాదంటూనే… అవసరమైతే తానే సీఎం అనే అవుతాననే సంకేతాలు బహిర్గతం చేశారు. అలాగే త్రిముఖ పోటీలో బలి కావడానికి తాను సిద్ధంగా లేమని, ఈసారి సీఎం పీఠం తనదేనని చెప్పకనే చెప్పారు . ఎన్ని స్థానాలు పొత్తు లో వచ్చినా పోటీకి సిద్ధమవ్వాలని నిర్ణయించుకుని.. ఎలాగైనా *కాపు కాసి అన్ని స్థానాలు గెలిపించుకోవాలనే దృఢ నిశ్చయానికి వచ్చారు. అదే సమయంలో ఎన్నికల్లో సహాయ నిరాకరణతో టీడీపీనిసాధ్యమైనంత తొక్కేయ్యాలనే సూత్రం జన సేన, బీజేపీ అంతర్గత వ్యూహంగా తెలుస్తోంది. అందుకే తెలుగు దేశం పార్టీ వాళ్ళను సీఎం చేయడానికి సిద్ధంగా లేమని ముందే సంకేతాలను ఈ ప్రసంగం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పొత్తులు ఉంటాయి కానీ నాలుగు గోడల మధ్య ఒప్పందాలు ఉండవని ప్రజల మధ్య ఒప్పందాలు ఉంటాయని సేనాని స్పష్టం చేశారు. నిర్ణయాత్మక శక్తిగా నిలిచి సీఎం పీఠాన్ని అధిరోహించాలనే ప్రధాన లక్ష్యం.
ఇటీవలే జనసేన ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ పొత్తులపై స్పందించారు. వచ్చే ఎన్నికల్లో తాను సీఎం అభ్యర్థిని కానని పరోక్షషంగా వెల్లడించారు. సీఎం కుర్చీని గట్టిగా అడిగి తీసుకోగల బలం ప్రస్తుతానికి జనసేనకు లేదన్నారు. కానీ శుక్రవారం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు దీనికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి . “వచ్చే ఎన్నికల్లో ఓటు చీలనివ్వనని చెప్పారు. ఈ దిశగానే మా పొత్తులు, ఉంటాయి. కొన్ని పార్టీలు దశాబ్దాలుగా రాజకీయంగా మనుగడ సాగిస్తున్నాయి… అలాంటి పార్టీలపై మాకు గౌరవం ఉంది. కానీ తెలుగుదేశం వాళ్లను సీఎంగా చేసేందుకు పార్టీ పెట్టలేదంటే కానీ స్వయంగా సీఎం పీఠాన్ని కోరుకుంటున్నట్లు నర్మగర్భంగా సంకేతాలు అందించారు. కనీసం 30 నుండి40 స్థానాలు గెలుచుకోగలిగితే సీఎం పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్న ప్రత్యర్థుల ఆట కట్టించవచ్చని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారింది. దీని కోసమే సీట్ల సర్దుబాటు విషయం లో కొంచెం తగ్గినట్లు పైకి నటిస్తున్నా.. లోపల ఆంతర్యం వేరేగా ఉందని ఈరోజు ప్రసంగం తో స్పష్టంగా తేలిపోయింది.
ఏ పార్టీతోనో ప్రేమా లేదు పగా లేదు అని తెలిపిన జనసేనాని మనసులో ఏముందో గ్రహించలేనిది కాదు… ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి సీఎం పీఠాన్ని కైవసం చేసుకోవాలనేదే సేనాని ఆంతరంగిక వ్యూహంలా కనిపిస్తోంది. 30 నుంచి 40 శాతం ఓట్లు ప్రజలు ఇవ్వగలిగితే అప్పుడు నిర్ణయాత్మక శక్తిగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. అందుకే ముఖ్యమంత్రి ఎలా అనేది ఎన్నికలు అయిన తర్వాత చూసుకుందాం అని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్లో ఎన్నికలు పెట్టే అవకాశం ఉందని అందుకే మేము జూన్ నుంచే ప్రచారానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు ఉభయగోదావరి జిల్లాల్లో 30% ఇతర జిల్లాల్లో 20 శాతం ఓటు బ్యాంక్ ఉందని ఇది అధికారం చేజిక్కించుకోవడానికి సరిపోతుందా లేదా అనేది తేలాల్సి ఉందని అన్నారు. రూపాయి పెట్టుబడి లేకుండా గత ఎన్నికల్లో ఏడు శాతం ఓట్లు సాధించగలిగామని కానీ ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఓటు శాతం అనూహ్యంగా పెరిగిందని దీమా వ్యక్తం చేశారు. ఇటీవల తాను టీడీపీ నేతలను కలుస్తుంటే కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
మీరు తగ్గడం ఏంటి… మీరు సీఎం అభ్యర్థి అని అవతలివాళ్ళ ఒప్పుకుంటేనే పొత్తు పెట్టుకోండి అని అంటున్నారని ఈ విషయం పవన్ కళ్యాణ్ లో ధీమాను పెంచిందని, . కర్ణాటకలో కుమారస్వామి లాగా చక్రం తిప్పాలంటే చేతిలో 40 స్థానాలు ఉండాలనీ ఈ దిశగా ఒత్తులో భాగంగా సీట్లు సంపాదించాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో తగినన్ని సీట్లు సంపాదించడమే కాకుండా తెలుగుదేశం పార్టీని సహాయ నిరాకరణతో సాధ్యమైనంత తొక్కేయాలని పార్టీ పెద్దలు, కాపు నాయకులతో సమాలోచనలు జరిపినట్లు సమాచారం. పొత్తులో ఉంటూనే సుతిమెత్తగా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలనేదే బిజెపిని మిత్రపక్షంగా తీసుకురావడానికి పవన్ వేసిన ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపైన ఇటీవల ఢిల్లీ పెద్దలతో ఈ విషయం పై సుదీర్ఘ చర్చలు జరిగాయని వారు భావిస్తున్నారు.
వైసీపీ నుంచి ఆంధ్రప్రదేశ్ ను కాపాడడమే. ‘ముఖ్యం” అని పవన్ కల్యాణ్ పైకి స్పష్టం చేస్తున్నా అంతర్గతంగా టిడిపిని కూడా దెబ్బతీయాలని బిజెపితో కలిపి ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ఊహగానాలు వెలువత్తుతున్నాయి. ఇదే కనుక జరిగితే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాలి.