- ఉద్యోగ రీత్యా దూరమైనా చెదిరిపోని ప్రేమ భావం .
- పెద్దలు నిరాకరిస్తే పోలీసులను ఆశ్రయించిన యువ జంట
- ఎట్టకేలకు అన్నవరం దేవస్థానంలో పెద్దల సమక్షంలో వివాహం.
పిఠాపురం, జన సేన ప్రతినిధి, జూన్ 26: కాకినాడ జిల్లా, పిఠాపురం రూరల్, కందరాడ గ్రామానికి చెందిన మచ్చా బాలరాజు కుమారుడు సిఆర్ పిఎఫ్ కానిస్టేబుల్ సతీష్ చంద్ర, అదే గ్రామానికి చెందిన గంటేడి అబ్బులు కుమార్తె శాంతి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ వివాహాం చేసుకుందామని నిర్యించుకున్నారు. ఈ కులాంతర వివాహం ఇష్టంలేని అబ్బాయి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీనిపై ప్రియురాలు శాంతి ప్రియుడు తల్లిదండ్రులపై పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది. ఇరువురి తల్లిదండ్రులను పోలీసులు స్టేషన్ కు పిలచి వివాహాం చేసుకోపొతే జరిగే పరిణామాలను వివరించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం
ఈ నెల 21న గురువారం తెల్లవారితే 12:05 ని.లకు రెండు కుటుంబాలు కలిసి బంధుమిత్రుల సమక్షంలో అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఎ కొత్తపల్లి శివాలయంలో ఘనంగా వివాహాం జరిపారు. దీంతో నాలుగేళ్ల గా ప్రేమించుకుని ఒక్కటైన ప్రియుడు సతీష్ చంద్ర ను ప్రియురాలు శాంతిని అందరూ అభినందించారు.