బీసీలు వెన్ను విరుస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వం
జనసేన ప్రతినిధి, అంబేద్కర్ కోనసీమ, ఐ.పోలవరం, నవంబర్ 3: మురమళ్ళ తెలుగుదేశం క్యాంప్ కార్యాలయంలో అమలాపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు వాడ్రేవు వీరబాబు గారు అధ్యక్షతన బీసీల వెన్నువిరుస్తున్న జగన్ రెడ్డి అనే పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో గుత్తుల సాయి మాట్లాడుతూ ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 75 వేల 760 కోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధులు గారి మళ్లించారు అలాగే ఆదరణ లాంటి 30కి పైగా బీసీ సంక్షేమ పథకాలను రద్దు చేశారు .
రిజర్వేషన్లు 34% నుండి 24% తగ్గించి 16,800 రాజ్యాంగ పదవులు దూరం చేశారు. 14 లక్షలు ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేస్తున్నారు అందులో అత్యధిక భాగం బీసీలవే, 70 వేలకు పైగా బిసి బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయలేదు, 13 బీసీ భవనాలు, 1187 కమ్యూనిటీ హాల్ నిర్మాణాలను నిలిపివేశారు, ఐదవ స్థానంలో ఉన్న ద్వారకాతిరుమల రావుని తప్పించి 16వ స్థానంలో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి కి డీజీపీగా నియమించిన జగన్ రెడ్డి బీసీలకు తీరని అన్యాయం చేశారు.
అలాగే మందాల గంగ సూర్యనారాయణ మాట్లాడుతూ 13 బీసీ భవనాలు, 1187 కమ్యూనిటీ హళ్ళ నిర్మాణాలను నిలిపివేశారు. మద్యం ధరలు పెంచి,నాసిరకమైన మద్యం పోసి 30 లక్షల మంది అనారోగ్యన్ని పాడు చేశారు, అందులో 30000 మంది ప్రాణాలు తీసి వారి భార్యల మాంగల్యాలు తెంచారు, మద్యం బాధితుల్లో అత్యధికలు బీసీలే. ధరలు,చార్జీలు బాదులతో ఒక్కో కుటుంబం పై రెండు లక్షలు 80 వేలు భారం వేశారు, నామినేట్ పదవుల్లో 90% సొంత వర్గమే, సలహాదారులు ఒక బీసీ కూడా లేదు, 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు ఇవ్వకుండా ఉత్సవ విగ్రహాలు చేశారు.
ఇప్పటికైనా జగన్ రెడ్డి మోసపూరితమైన ప్రభుత్వాన్ని నమ్మకుండా వచ్చే 2024 ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నర్సాపురం నియోజవర్గ అబ్జర్వర్ గుత్తుల సాయి, అమలాపురం పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు వాడ్రేవు వీరబాబు, అమలాపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి టేకుమూడు లక్ష్మణరావు,అమలాపురం పార్లమెంట్ కార్యనిర్వహణ కార్యదర్శి మందాల గంగ సూర్యనారాయణ, అమలాపురం పార్లమెంట్ శెట్టిబలిజ సాధికార సభ్యులు పిల్లి సత్తిబాబు, అమలాపురం పార్లమెంట్ తెలుగుమహిళ అధికార ప్రతినిధి బొక్క రుక్మిణి, ముమ్మిడివరం నియోజకవర్గం బిసి సెల్ అధ్యక్షులు పిల్లి నాగరాజు, తాళ్ళరేవు మండల ప్రధాన కార్యదర్శి కట్టా త్రిమూర్తులు,గంజా సూరిబాబు , మేడిశెట్టి సత్తిబాబు,గుత్తుల వెంకటేశ్వరరావు, కొప్పడి సూరిబాబు,దంగేటి శ్రీనివాసరావు,చప్పిడి దుర్గ ప్రసాద్, దూనబోయిన రామ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.