Janasena News Paper
అంధ్రప్రదేశ్అనంతపురం

గుంతకల్లులో వైసీపీ అభివృద్ధి అంటే ఇదేనా..

  • గుంతకల్లులో వైసీపీ అభివృద్ధి అంటే ఇదేనా..
  • మైనార్టీలు అంటే అంతా చులకన
  • ప్రారంభానికి నోచుకోని ఉర్దూ కాలేజ్ !
  • ముస్లిం మైనారిటీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతారా

గుంతకల్ జనసేన ప్రతినిధి ఫిబ్రవరి 04:గుంతకల్లు లో పెరుమాళ్ళ జీవానంద రెడ్డి నివాసం నందు జరిగిన ముస్లిం మైనారిటీల సమీక్షలో జీవానంద రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ లు ఎక్కువగా ఉన్నారని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుందని,తెలుగుదేశం ప్రభుత్వం లో ఉర్దూ జూనియర్ కాలేజీ 12 కోట్ల వ్యయం తొ కట్టించారాని కానీ నేటికీ అది ఉపయోగించకూడా మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేసి గుంతకల్ కో రెవెన్యూ అధికారి ఆఫీస్ తెచ్చాం, డిఎస్పి కార్యాలయం తెచ్చామంటూ విద్యార్థుల కోసం నిర్మించిన భవనాలను వారికి కేటాయించి సిగ్గు లేకుండా ఏదో అభివృద్ధి చేశామని చెప్పుకోవడం పై స్థానికుల హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.బాలికల కోసం కట్టించిన వసతి గృహం ఉపయోగించక పోవడంతో విద్యార్థినిలు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారని ఎన్నోసార్లు ఈ నాయకుల చుట్టూ చెప్పులు అరిగేలా ప్రదక్షిణలు చేసిన ప్రయోజనం లేకపోయింది జీవానంద రెడ్డి తో వారి బాధను విల్లవించుకున్నారు.

స్థానిక మైనార్టీ సోదరులు ముఖ్యంగా పట్టణానికి అనుసంధానమైన చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చిన విద్యార్థినిలు ఉండటానికి వసతి లేక చదువును సైతం వదిలేసి పొలం పనులకు వెళ్తున్నారన్నారు. స్థానికులు,ముస్లిం మైనారిటీ ఓట్ల తో అధికారం లోకి వచ్చిన వైస్సార్సీపీ గతంలో 15 కోట్ల విలువ చేసే భూమిని తమ బిడ్డల భవిష్యత్ కోసం ముస్లిం సంస్థలు దానంగా భూమిని కేటాయించారని అందులో 4 కోట్ల రూపాయలు ఖర్చు చేసి బాలికల కోసం హాస్టల్ ను నిర్మించారాని ,అది నేటికీ పూర్తి చేసి ఇవ్వలేని దీనస్థితిలో ఎమ్మెల్యే ఉన్నారని అన్నారు .

ముస్లిం సోదరులకు ప్రార్థన స్థలాలు కావాలని ఐదు సంవత్సరాల నుంచి వేడుకుంటున్నప్పటికిని ఎమ్మెల్యే కి కనికరం కలగలేదన్నారు. ఎందుకంటే వీరికి దోచుకోవడం దాచుకోవడంలో చాలా బిజీ అయిపోయారు అన్నారు. గుంటకల్లొ తన నివాసం నందు జీవానంద రెడ్డి తో నజీర్ అహమ్మద్ సెక్రటరీ అల్లా మీన్ జగత్ కమిటీ , సయ్యద్ అహమ్మద్ ప్రెసిడెంట్ అల్లామిన్ జగత్ కమిటీ , వలి ప్రెసిడెంట్ ముస్లిం జన జాగరణ కమిటీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం మైనారిటీ ల సమస్యలు తీరుస్తామని పెరుమాళ్ళ జీవనంద రెడ్డి హామీ ఇచ్చారు.

Related posts

Leave a Comment