అక్రమంగా నాటు సారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు

మెంటాడ,ఏప్రిల్ 6, జనసేన ప్రతినిధి: మెంటాడ మండలంలో అక్రమంగా నాటు సారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేసామని ఆండ్ర సబ్ ఇన్స్పెక్టర్ దేవి తెలిపారు. శనివారం ఆమె తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిగుమ్మి గెడ్డ వద్ద రాంబద్రపురం మండలం చెందిన ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంతో నాటు సారా తరలిస్తుండగా సిబ్బందితో అదుపులోకి తీసుకున్నమన్నారు. వారి వద్ద నుండి15.75 లీటర్ల నాటు సారా, బైక్ స్వాధీనం చేసుకుని ఇద్దరు పైన కేసులు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.