ప్రజల నుంచి పల్లె సింధూర కు అనూహ్య స్పందన
ఎనుముల పల్లెలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కూటమి అభ్యర్థి కి ఘన స్వాగతం..
పెద్ద ఎత్తున పాల్గొన్న టిడిపి జనసేన బిజెపి నాయకులు….
పుట్టపర్తి, జనసేన బ్యూరో, ఏప్రిల్ 07:
పుట్టపర్తి పట్టణం ఎనుములపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి ,మాజీమంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ,ఆయన తనయుడు పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి స్థానిక డప్పు వాయిద్యాల మధ్య అపూర్వ స్వాగతం పలికి పూల వర్షంతో పలికిన ఎనుములపల్లి గ్రామస్తులు. అనంతరం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి జనసేన ఇన్చార్జ్ పత్తి చలపతి పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి, మరియు టిడిపి నాయకులతో కలిసి పెద్ద ఎత్తున, ప్రచారం నిర్వహించిన, కూటమి ఉమ్మడి అభ్యర్థి సింధూర రెడ్డి.
ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, జగన్ దుర్మార్గపు చర్యలతో ఏపీ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, పేర్కొన్నారు. ఈ వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి 50 ఏళ్ల వెనక్కి పోయిందన్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయకుల చేసిన అరాచకాలకు ప్రజలు ఎంతో ఓపిక పట్టారనీ అన్నారు. వైసీపీ అరాచకాలకు స్వస్తి పలికే రోజు దగ్గరలో ఉందన్నారు. టీడీపీ , కూటమి ఏపీ లో అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. ఈ మూడు పార్టీల కలయిక ఏపీ అభివృద్ధి కి నాంది కావాలన్నారు. రాష్ట్రంలో టీడీపీ ఉమ్మడి కూటమి, అధికారంలోకి వచ్చి కేంద్రంలో బీజీపీ కూటమి అధికారంలోకి వస్తేనే అభివృద్ధి పథంలో ఏపీ ముందుకు పోవడానికి ఆస్కారం ఉందన్నారు.
అహంకారే కాదు
బాగా మాటలకారి -పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి
పుట్టపర్తి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే దుద్దేకుంట శ్రీధర్ రెడ్డి అహంకారం ఎక్కువ, మాటలెక్కువ అని పల్లె కృష్ణ కిషోర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రశాంతంగా ఉన్న పుట్టపర్తిలో అశాంతిగా మార్చిన ఘనుడు ఈ ఎమ్మెల్యే అని పేర్కొన్నారు. దుద్దే కుంట శ్రీధర్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఇస్తే పుట్టపర్తికి పుట్టగతి లేకుండా చేస్తాడని ప్రజలను హెచ్చరించారు. నియోజకవర్గ చరిత్రలో ఇలాంటి అవినీతి , అరాచకాలు దౌర్జన్యాలు వేదింపులకు పాల్పడిన ఎమ్మెల్యే ను ఎప్పుడు చూడలేదన్నారు.
ప్రజలు ఆలోచన చేసి నీతి నిజాయితీ తో పాలన చేసే మంచి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. టీడీపీ తీసుకొచ్చిన సూపర్ సిక్స్ పథకం పేదలకు ఒక వరం అన్నారు. ప్రజల్లో టీడీపీకి రోజు రోజుకు అనూహ్య స్పందన లభిస్తోందని అన్నారు. మే 13 న జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి నీ అత్యధిక మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత మనందరి పైన ఉందన్నారు. కాబట్టి సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించిన పల్లె సింధూర రెడ్డి. ఈ కార్యక్రమంలో, టిడిపి జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు, ఐటీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.