జనహృదయనేత జగన్ కే ప్రజా మద్దతు
తెదేపా నుంచి వైసీపీలోకి వలసలు.
ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉంటాం: మంత్రి అంబటి
రాజుపాలెం:
సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్సీపీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. సోమవారం కొండమూడులో జరిగిన విస్తృత సమావేశంలో కొండమోడు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరుగురు ముఖ్య కార్యకర్తలు మంత్రి అంబటి సమక్షంలో వైఎస్ఆర్సిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారందరికీ అంబటి రాంబాబు పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు.
మంత్రి అంబటి మాట్లాడుతూ కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తుపెట్టుకుంటామన్నారు. పార్టీ మీకు అండగా ఉంటుందని వివరించారు. తెలుగుదేశం పార్టీలో లేని సముచిత స్థానం వైఎస్ఆర్సిపి లో మీకు లభిస్తుందన్నారు. గెలిచేది మనమేనని, తిరిగేది ఫ్యానేనని, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విజయం తధ్యమన్నారు. దానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణే సాక్ష్యమన్నారు.
పార్టీలో చేరిన వారిలో గత ఎన్నికల్లో ప్రస్తుత వైఎస్సార్ సిపి ఎంపీటీసీ మేరీ పై తెలుగుదేశం తరుపున పోటీ చేసి ఓటమిపాలైన అభ్యర్థి భర్త దుర్గారావు కూడా వైఎస్ఆర్సిపి తీర్థం పుచ్చుకున్నారు. దుర్గారావుకు ఎంపీటీసీ మేరీ పార్టీ కండువాను కప్పి సాధారణంగా ఆహ్వానించారు. దుర్గారావు తో పాటు నల్ల మేకల ఎలమంద, ఆవుల శివయ్య , సీతారామయ్య ,బాబుల్ రెడ్డి , మోదుగుల అంజిరెడ్డిలు ఉన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ వేపూరి శ్రీనివాసరావు, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సిపి అనుబంధ సంఘాల బాధ్యులు, తదితరులు ఉన్నారు.