Janasena News Paper
అంధ్రప్రదేశ్అనంతపురంతాజా వార్తలు

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మైనింగ్  మాఫియా 

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మైనింగ్  మాఫియా 
: రైతు రక్షణ వేదిక వ్యవస్థాపకులు గౌని ప్రతాపరెడ్డి.


రాయదుర్గం జనసేన ప్రతినిధి ఏప్రిల్ 10:  డీ హీరే హాల్ మండలం సోమలాపురం గ్రామంలోని రైతులు, ప్రజలు మరియు విద్యార్థుల ఆహ్వానం మేరకు  మంగళవారం రాయదుర్గం రైతు  రక్షణ వేదిక వ్యవస్థాపకులైన  గౌని ప్రతాపరెడ్డి గ్రామాన్ని సందర్శించారు. సోమలాపురం గ్రామానికి 800 మీటర్ల దూరంలో ఉన్న  రైల్వే స్టేషన్ కు ఆనుకొని ఉన్న రైల్వే భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రతినిత్యం మైనింగ్ లోడింగ్ మరియు అన్లోడింగ్  జరుగుతుండడం వల్ల  ఏర్పడే దుమ్ము దూళి చుట్టుపక్కల వందల ఎకరాలకు విస్తరించి వ్యవసాయ భూములు సాగుకు పనికిరాకుండా పోతున్నాయని  రైతులు వాపోయారు.

అలాగే ఈ రైల్వే స్టేషన్ కు దగ్గర్లో ఉన్న  హై స్కూలు, రైల్వే స్టేషన్ పరిసరాల్లో కూడా  పెద్ద ఎత్తున దుమ్ము దూళి పేరుకుపోవడం వల్ల రైతులకు, విద్యార్థులకు మరియు ప్రయాణికులకు ఇబ్బందిగా మారి అనారోగ్యానికి గురవుతున్నారు. అంతు చిక్కని ఆరోగ్య సమస్యలతో చాలామంది ప్రజలు, రైతులు మరియు విద్యార్థులు విలవిల్లాడుతున్నారు. కావున రాయదుర్గం రైతు రక్షణ వేదిక తరపున ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణమే నిబంధనలకు విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా  జరగుతున్న మైనింగ్ లోడింగ్ అన్లోడింగ్ పనులు జరగకుండా  చూడాలన్నారు .సోమలాపురం గ్రామస్తులు, రైతులు ముక్తకంఠంతో రైతు రక్షణ వేదిక గౌని ప్రతాపరెడ్డి కి తమ గోడును విన్నవించుకున్నారు .

అంతేకాకుండా ఈ మైనింగ్ లోడింగ్ అన్లోడింగ్ వల్ల రైతులు వారి పొలాలకు వెళ్లే దారి కూడా అస్తవ్యస్తంగా మారిపోయిందని వాపోయారు. దీనిపై స్పందించిన రాయదుర్గం రైతు రక్షణ వేదిక వ్యవస్థపకులు గౌని ప్రతాపరెడ్డి కి సంబంధిత అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకో వెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మొండీ మల్లికార్జున ,  మాజీ ఎంపీటీసీ సురేష్ ,  న్యాయవాది గంగాధరయ్య స్వామి,  నాగిరెడ్డి,  మేఘనాత్ రెడ్డి,  రాజశేఖర్ తో పాటుగా వంద మంది పైగా సోమళాపురం రైతన్నలు,  విద్యార్థులు,  యువత పాల్గొన్నారు.

Related posts

Leave a Comment