Janasena News Paper
తెలంగాణబ్రేకింగ్ న్యూస్మేడ్చల్-మల్కాజ్గిరి

ఘట్కేసర్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్….

ఘట్కేసర్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్….

పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజీనామా చేసిన ఛైర్పర్సన్..

మనస్థాపంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన..

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పంపిన రాజీనామా లేఖ…


జనసేన ప్రతినిధి ఘట్కేసర్ ఏప్రిల్ 11
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్  పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేల బిగ్ బిఆర్ఎస్ పార్టీకి  సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేశారు. మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రోద్బలంతో ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ మాధవ్ రెడ్డి రెడ్డి సహకారంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు తనపై అవిశ్వాసం పెట్టినందుకు మనస్థాపం చెంది బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ మేరకు రాజీనామా లేఖను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు పంపినట్లు తెలిపారు. గత నాలుగేళ్లుగా మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి బహుమతులు అందుకున్న తనకు మద్దతుగా ఉండాల్సిన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు తనపైనే అవిశ్వాసం నోటీసులు ఇవ్వడం మానసిక క్షోభకు గురి చేసిందన్నారు.


ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు, ఘట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, ఇండిపెండెంట్ కౌన్సిలర్ల మద్దతుతో అవిశ్వాసం నెగ్గేలా సహకరించారన్నారు. అందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పావని పేర్కొన్నారు. చైర్ పర్సన్ పదవి కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజకీయాలు చేస్తూ నాలుగేళ్ల పాటు ఇబ్బందులకు గురిచేసినా ఎంతో ఓపిక పట్టానని తెలిపారు. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే మల్లారెడ్డి ఘట్కేసర్ మున్సిపాలిటీలో తలెత్తిన వర్గపోరు విషయంలో జోక్యం చేసుకుని చర్చలు జరపకుండా సమస్యను పెద్దగా చేయడం బాధ కలిగించింది అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఎంత సేవలు చేసినా అధిష్టానానికి తనపై నమ్మకం లేకపోవడంతోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పావని జంగయ్య యాదవ్ తెలిపారు.

Related posts

Leave a Comment