రంజాన్ నీ ప్రశాంతంగా జరుపుకోవాలి – రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్.
బి ఎల్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం.
జనసేన ప్రతినిధి ఏప్రిల్ 10 :
ఉప్పల్ నియోజకవర్గం లోని మస్జిద్ లకు ఇమామ్ మరియు మోజన్ లకు రంజాన్ సందర్భంగా బి సైనిక్ పూరి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్ ఆర్ ట్రస్ట్ ద్వారా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా నూతన దుస్తులు అందచేయడం జరిగింది. స్పీకర్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఎంతో నిష్ఠగా, కఠోర ఉపవాసాలు ఉండి పండుగ జరుపుకుంటున్న సందర్భంగా ఇమామ్ మరియు మోజన్ లకు సాంప్రదాయ నూతన దుస్తులు అందజేస్తున్న బి ల్ ఆర్ ట్రస్ట్ వారికి అభినందనలు తెలియచేసారు. అలాగే రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియచేసారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దుస్తులు పంపిణీ చేస్తామని గత సంవత్సరం మినిస్టర్ క్వార్టర్స్ లో మాజీ హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీ చేతుల మీదుగా ఇచ్చామని, ఈసారి స్పీకర్ చేతుల మీదుగా ఇచ్చామని, ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ బి ఆర్ ఎస్ పార్టీ మైనారిటీ చైర్మన్ మహమ్మద్ బద్రుద్దీన్, నాయకులు ఎస్ ఏ రహీం, మహేమోద్, నయీమ్, సలీం, కరీం తదితరులు పాల్గొన్నారు.
Related posts
- Comments
- Facebook comments