వాలంటీర్ల ముసుగులో నకిలీ వాలంటీర్ రాజీనామా…
పంచాయతీ కార్యదర్శి లేకున్నా కంప్యూటర్ ఆపరేటర్ ప్రోద్బలంతో రాజీనామాలు
వాలంటీర్లు రాజీనామాలు చేయకున్నా చేసినట్టు రూరల్ ఎంపీడీవో పుల్లయ్య ఆమోదం
నకిలీ వాలంటీర్ల రాజీనామాలకు ప్రోత్బల రాజీనామాలకు రూరల్ ఎంపీడీవో పుల్లయ్య ఒత్తాసు
ఎన్నికల నిబంధనలకు జో కొడుతూ…నిబంధనలు అతిక్రమించిన వారికి జేజేలు కొడుతున్న రూరల్ ఎంపీడీవో
అనంతపురం రూరల్ జనసేన ప్రతినిధి ఏప్రిల్ 11:
ప్రభుత్వ విధులలో భాగంగా అధికారులు తమ తమ విధులలో పక్షపాతం లేకుండా చట్టానికి లోబడి ఉన్నతాధికారుల ఆదేశాలను బాధ్యతగా అనుసరిస్తూ ఎక్కడ విధులలో లోటుపాట్లు లేకుండా కింది స్థాయి ఉద్యోగులు తప్పు చేసిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సదరు అధికారుల పై ఉన్నా కొందరు అధికారులు బాధ్యత మరచి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు ఒక ఎత్తు అయితే ఇంకొంతమంది అధికారులు తప్పు చేసిన వారికే జేజేలు కొట్టడం బహు ఆశ్చర్యం కలిగిస్తోంది. వివరాల్లోకి వెళితే 2024 ఎన్నికల జరుగుతున్న తరుణంలో సాధారణంగా ఆయా రాజకీయ పార్టీలు వారి రాజకీయ లబ్ధి కోసం పాకులాడే సమయంలో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో వాలంటీర్ల ఊసే కీలకంగా ఉన్న పరిస్థితుల్లో అలాంటి వాలంటీర్ల విషయానికి వస్తే స్థానిక రూరల్ మండల పరిధిలో గల కక్కలపల్లి రూరల్ సచివాలయ వాలంటీర్లకు అదే సచివాలయంలోని చిరు ఉద్యోగి అయిన కంప్యూటర్ ఆపరేటర్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న లెక్కచేయకుండా వాలంటీర్లకు ఫోన్ చేసి విశ్వసనీయవర్గాల ఆదేశాలు ఉన్నవని వాలంటీర్ల రాజీనామాలకు ప్రోద్బలించగా సదరు వాలంటీర్లు హుటాహుటిన అందుబాటులో ఉన్నవారు మరియు అందుబాటులో లేనివారు వారి స్థానంలో మరొకరిని పెట్టి పంచాయతీ కార్యదర్శి అందుబాటులో లేకున్నా అదే సచివాలయానికి సంబంధించిన మహిళా పోలీస్ మరియు ఏఎన్ఎం కు రాజీనామాలు అందింపజేశారు.
ఈ విషయమై సామాజిక మాధ్యమాల్లో వెలువడగా రూరల్ మండలానికి సంబంధించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి విచారణ నిమిత్తం రూరల్ ఎంపీడీవో పుల్లయ్య ను ఆదేశించగా, ఆయన తూతూ మంత్రంగా చర్యలు చేపడుతూ కంప్యూటర్ ఆపరేటర్ ఫోన్ కాల్ ప్రమేయ రాజీనామాల జరిగాయన్న పరిణామాల దృష్ట్యా సచివాలయానికి వచ్చిన రాజీనామాలు అంగీకరించలేదని స్వయంగా ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన రాజీనామాలే అంగీకరించామంటూ హితువులు పలికిన ఆయన సచివాలయంలోనే C20 వాలంటీర్ కి బదులు వాలంటీర్ ముసుగులో వేరే వ్యక్తి వచ్చి రాజీనామా చేసిన అలాగే ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి రాజీనామాలు చేయని C9, C8, C23 వాలంటీర్ల రాజీనామాలను ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి స్వచ్ఛంద రాజీనామాలు చేసినట్లు ఆలస్యంగా రాజీనామాలు ఇచ్చిన వెంటనే ఆమోదించినట్లు ఎంపీడీవో వెల్లడించారు.
సదరు ఎన్నికల నిబంధనలను అతిక్రమించిన కంప్యూటర్ ఆపరేటర్ పై చర్యలు తీసుకోకపోగా వాటికి రూరల్ ఎంపీడీవో డొంక తిరుగుళ్ళులా నిర్లక్ష్యం చూపసాగారు. సదరు కంప్యూటర్ ఆపరేటర్ పై చర్యలు తీసుకోకపోవడానికి డిపిఓ కార్యాలయంలో వారి బంధువులు ఉండడమేనంటూ నన్ను ఎవరు ఏమి చేసుకోలేరని కంప్యూటర్ ఆపరేటర్ ప్రగల్భాలు పలుకుతూ ఇరు పార్టీ నాయకుల చే వివరణ కోరిన వారిపై పైరవీలు చూపుతున్నారు. సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారి చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించిన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వీటిపై జిల్లా ఎన్నికల అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాలి. మరిన్ని వివరాలతో మరో శీర్షికలో మీ ముందుకు.