Janasena News Paper
తెలంగాణమెదక్ జిల్లా

మెదక్ రైల్వే స్టేషన్ వద్ద అద్వాన్నంగా మారిన రోడ్డు

మెదక్ రైల్వే స్టేషన్ వద్ద అద్వాన్నంగా మారిన రోడ్డును బాగుచేయండి:

 మెదక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్

 

జనసేన ప్రతినిధి, మెదక్ జిల్లా:

మెదక్ రైల్వే స్టేషన్ వద్ద బైపాస్ రోడ్డు అద్వాన్నంగా తయారైందని మెదక్ లారీ అసోసియేషన్ నాయకులు తెలిపారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ రైల్వే స్టేషన్ కు యూరియా వ్యాగిన్ దిగుమతి కోసం మెదక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నుండి లారీల ద్వారా గోదాంకు తరలించడంలో మెదక్ రైల్వే స్టేషన్ వద్ద బైపాస్ రోడ్డు అద్వాన్నంగా తయారైందని, మోకాలి లోతు గుంతలతో లారీల నడపడానికి డ్రెవర్లు జంకుతున్నారని పేర్కొన్నారు.

ఈవిషయమై మెదక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అరిఫ్ మాట్లాడుతూ మెదక్ పట్టణములోని రైల్వే స్టేషన్ బైపాస్ రోడ్డు గుంతలతో లారీలు రిపేర్లకు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయమై పలుమార్లు రైల్వే శాఖ జీఎంకు, డిఎంకు వినతిపత్రాన్ని ఇచ్చినప్పటికీ ఫలితం లేదన్నారు.రహదారి బాగాలేక రిపేర్లు ఎక్కువ అవుతున్నాయని ప్రభుత్వం ఇచ్చే లారీ కిరాయి లారీలకు సరిపోతుందని ఆవేదన చెందుతున్నారు.మా ఓనర్లు ఫైనాన్స్ ద్వారా లారీలు కొనుగోలు తెచ్చుకున్నారని ఇప్పుడు బ్యాంకు బకాయిలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారన్నారు.

ప్రతి సంవత్సరం రైల్వే వ్యాగిన్ ద్వారా యూరియా రావడం జరుగుతుందని,యూరియా సరఫరాలో రోడ్డు బాగలేక ఇబ్బందులు ఎదురవుతు న్నాయని తక్షణమే రహదారి బాగుచెయ్యాలని అరిఫ్ డిమాండ్ చేశారు.ఈవిషయం పై గంతలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని రహదారి బాగుచెయ్యాలని కోరామని తెలిపినప్పటికి ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించిందని చెప్పారు.ప్రస్తుత ఎంపీ ఎం.రఘునందన్ రావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావులు చొరవ తీసుకొని రైల్వే అధికారులతో మాట్లాడాలని మామెదక్ ఓనర్స్ లారీ అసోసియేషన్ తరపున కోరుతున్నామని చెప్పారు.ఈ సమావేశంలో మెదక్ లారీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ నరేష్ గౌడ్,మున్న సెక్రటరీ క్యాషియర్ నాయిమౌదుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment