కాకినాడ రూరల్, జనసేన ప్రతినిధి, సెప్టెంబరు 28: కాకినాడ రూరల్ మండల ఎంపిడిఓ కార్యాలయంలో కాకినాడ రూరల్ మండల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మన ఇల్లు మన గౌరవం ద్వారా గృహ లబ్దిదారుల అవగాహన కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసన సభ్యులు పంతం నానాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ప్రతి మనిషి కల సొంత ఇల్లు నిర్మించుకోవడం, మన ఇల్లు మన గౌరవం ద్వారా గృహ లబ్దిదారుల అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంభందిత శాఖల వారికి ఎమ్మెల్యే పంతం నానాజీ అభినందనలు తెలిపారు. లబ్దిదారులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంటిని నిర్మించుకొని సొంతంటి కలను నిజం చేసుకోవాలని కోరారు.
కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో చొరవ తీసుకుని ప్రజలకు అవగాహన కల్పించి నూతన లబ్దిదారులకు ఇళ్ల నిర్మాణానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. 2025 సంవత్సరం నాటికి 1 లక్ష 50 వేల ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ఎన్ డి ఏ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసిందని ఎమ్మెల్యే పంతం నానాజీ గారు వివరించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, జనసేన, టీడీపీ మరియు బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.