కంభం, జనసేన ఆర్.సి. ఇంచార్జి (ఫిబ్రవరి 6):] విద్యార్థులు శారీరక దృఢత్వం పొందాలంటే ఆటలు తప్పనిసరి అని ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని స్థానిక శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ టి.జాన్ శామ్యూల్ అన్నారు. గురువారం ప్రీ ప్రైమరి విద్యార్థులకు ఆటల పట్ల అవగాహన పెంచడం కోసం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ జాన్ శామ్యూల్ మాట్లాడుతూ నేటి కాలంలో ఆటల ప్రాధాన్యత తెలుపుతూ, విద్యార్థులు శారీరక దృఢత్వం పొందాలంటే ఆటలు తప్పనిసరి అని అన్నారు. అనంతరం ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి జాన్ శామ్యూల్ బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏ.జి.ఎం. ఎన్.అంజయ్య, ఆర్.ఐ. సిహెచ్.సురేంద్ర, డీన్ ఆర్.వెంకట నాగార్జున మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.