కాకినాడ రూరల్, జనసేన ప్రతినిధి, ఫిబ్రవరి 8: జనసేన పార్టీ కార్యకర్తల సంక్షేమానికి పార్టీ అధిష్ఠానం ఎల్లవేళలా కృషి చేస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ గొడారిగుంటలోని రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు పంతం నానాజీ నివాసం వద్ద పంతం నానాజీ, యువనాయకులు పంతం సందీప్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కరప మండల అధ్యక్షులు బండారు మురళీ పుట్టినరోజు వేడుకలు జనసేన నాయకులు, వీర మహిళలు మధ్య ఘనంగా నిర్వహించారు. ముందుగా పంతం నానాజీ దంపతుల వద్ద బండారు మురళీ ఆశీర్వాదం తీసుకుని, అనంతరం కేక్ కట్ చేసారు.
ఎమ్మెల్యే పంతం నానాజీ బండారు మురళీని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంధర్భంగా పలువురు జనసైనికులు మాట్లాడుతూ కరప మండలంలో జనసేన పార్టీ బలోపేతానికి బండారు మురళీ విశేషంగా కృషి చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మురళీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముద్రగడ రమేష్, నీటి సంఘం అద్యక్షులు గోవిందు రాజులు, జన సేన నాయకులు వీర మహిళలు భవాని, రమ్య తదితరులు పాల్గొన్నారు.